English | Telugu

అవినాష్‌ను విదిలించుకొని సొహేల్‌తో డాన్స్ చేసిన‌ అరియానా!

బిగ్ బాస్ సీజ‌న్ 4 ముగిసిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీలో ముక్కు అవినాష్‌, అరియానా గ్లోరీ గురించి తెగ చెప్పుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం గోవాలో వాళ్లు చేసిన షికార్లు, బైక్ రైడింగ్‌లు, అవినాష్ నువ్వు నా బంగారం అంటూ అరియానా వ‌గ‌లు పోవ‌డం లాంటివి మంచి మ‌సాలా ఇచ్చాయి. అవినాష్‌, అరియానా మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ జ‌రుగుతోంద‌ని అనుకోవ‌డానికి ఇవి ఆస్కారం ఇచ్చాయి. టీవీ షోల‌లో ఆ ఇద్ద‌రూ క‌లిసి చేస్తున్న హంగామా కూదా దీనికి ఊతం ఇస్తోంద‌నేది నిజం.

కాగా, వ‌చ్చే ఆదివారం స్టార్ మాలో ప్ర‌సారం కానున్న కామెడీ స్టార్స్ షోలో ఆ ఇద్ద‌రి మ‌ధ్య పుడ‌క‌లా బిగ్ బాస్ 4 ఫైన‌లిస్ట్ సొహేల్ ర్యాన్ ప్ర‌వేశించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఈ షోలో ముక్కు అవినాష్ ఓ స్కిట్ చేశాడు. అందులో సొహేల్ కూడా భాగ‌స్వామి అయ్యాడు. ఇంత‌లో అందాల సిరి హ‌న్మంత్ కూడా వ‌చ్చేసింది. సిరి, సొహేల్ మాట్లాడుకుంటుంటే, వారి మ‌ధ్య‌లోకి అరియానా వ‌చ్చి సొహేల్‌ను వీపు మీద చ‌రిచి, "నీ సంగ‌తేంట్రా.. ఇక్క‌డ లైనెయ్య‌లే, హౌస్‌లో లైనెయ్య‌లే.. ఎప్ప‌డు అమ్మాయిలు క‌న్పిచ్చినా చూస్తుంటావ్‌రా" అని సీరియ‌స్‌గా అడిగింది. "హౌస్‌లో లైనేద్దామంటే మ‌ద్దెలో వొచ్చిండు గ‌దా" అని అవినాష్‌ను చూపెట్టాడు సొహేల్‌. దాంతో అవినాష్ త‌ల ప‌ట్టుకున్నాడు.

ఆ త‌ర్వాత "తెల్లాతెల్లాని చీర‌.. జారుతున్నాది సందెవేళ" పాట‌కు సొహేల్‌-వ‌ర్షిణి, అవినాష్‌-అరియాన రెండు జంట‌లుగా డాన్స్ చేశారు. ఉన్న‌ట్లుండి చ‌టుక్కున అవినాష్‌ను వ‌దిలేసి త‌ను కూడా సొహేల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి డాన్స్ చేసింది అరియానా. దాంతో ఇద్ద‌రు భామ‌ల‌తో సొహేల్ డాన్స్ చేస్తుంటే, చూడ‌లేక తను వ‌ర్షిణిని లాగాడు అవినాష్‌. వ‌ర్షిణి అవినాష్‌ను విదిలించి కొట్టి, సొహేల్‌తోటే డాన్స్ వేసింది. అవినాష్ ఊరుకోకుండా, ఈసారి అరియానా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆమెను లాగాడు. ఆమె కూడా విదిలించేసింది.

చేసేది లేక ఫ్లోర్ మీద కూల‌బ‌డి, ఒక‌రినొక‌రు హ‌త్తుకుంటూ డాన్స్ చేస్తున్న ఆ ముగ్గురి వంకే చూస్తుండిపోయాడు అవినాష్‌. అత‌డి బాధ‌ను మ‌రింత పెంచేస్తూ జ‌డ్జి శ్రీ‌దేవి కూడా సొహేల్‌తో జ‌త క‌లిసింది. అవినాష్ ఇప్పుడు నెత్తిన గుడ్డేసుకొని బేల ముఖం పెట్టాడు.. ఈ ప్రోమో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల దాకా వెయిట్ చెయ్యాల్సిందే..

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.