English | Telugu

ర‌విని "జ్వ‌రం కావాలా?" అని అడిగిన లాస్య‌!

యాంక‌ర్ ర‌వి, లాస్య ఇద్ద‌రూ క‌లిసి గ‌త కొన్నేళ్ల క్రితం మా మ్యూజిక్‌లో 'స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌' ప్రోగ్రామ్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. ఆ త‌రువాత కొన్నాళ్ల పాటు వీరి యాంక‌రింగ్ జ‌ర్నీ విజ‌య‌వంతంగా సాగుతూ వ‌చ్చింది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ వ‌రుస ప్ర‌చారాలు మొద‌లు కావ‌డం.. కొన్ని సంద‌ర్భాల్లో ర‌వి ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌పోవ‌డంతో ర‌వితో క‌లిసి యాంక‌రింగ్ చేయ‌డానికి నిరాక‌రించి గుడ్ బై చెప్పింది లాస్య.

దాదాపు ఐదేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రు స్టార్ మా కోసం 'ఫ్యామిలీ పార్టీ' షోలో క‌లిశారు. ఇద్ద‌రూ క‌లిసి యాంక‌రింగ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఆ ఇద్ద‌రి మ్యాజిక్ చిన్నితెర‌పై మ‌రోసారి అల‌రిస్తోంది. తాజాగా ఈ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న 'కామెడీ స్టార్స్‌' షోలో పాల్గొంటున్నారు. 'ఉప్పెన‌' థీమ్‌తో సాగే ఈ షోలో "జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు.." అంటూ సాగే పాట‌కు స్టెప్పులేశారు.

"జ్వ‌రం కావాలా ఆశీ" అంటూ ర‌విని అడిగిన లాస్య‌, "మా తా‌త‌య్య‌కు వాడిన సూది ఇది. దీంతో జ్వ‌ర‌మేంటి... ద‌గ్గు, జ‌లుబూ అన్నీ వ‌చ్చేస్తాయి." అన‌గానే ర‌వి బిత్త‌ర బిత్త‌ర‌గా చూడ‌టం.. లాస్య ప‌క ప‌కా న‌వ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ షోకి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తూ న‌వ్వులు పూయిస్తోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.