English | Telugu

బ‌ట‌న్ పెట్టుకో అఖిలూ!

బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లు కొంతమంది లవ్ ట్రాక్ లు నడిపిస్తుంటారు. ఒక్కో సీజన్ లో కనీసం రెండు జంటలైనా కనిపిస్తుంటాయి. అలా నాల్గో సీజన్ లో ఎన్నో ట్రాక్ లు బయటకు వచ్చాయి. మోనాల్-అఖిల్ జంట మాత్రం బాగా ట్రెండ్ అయింది. షో ముగిసిన కూడా తరువాత ఈ జంట సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇద్ద‌రూ సోషల్ మీడియాలో లైవ్ లోకి వస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. వీరిద్దరూ ప్రతిరోజూ వీడియో కాల్ మాట్లాడుకుంటారని తెలుస్తోంది.

మొన్నటికి మొన్న వీడియో కాల్ లో మోనాల్ ఏదో పాట పాడుతూ ఉంటే అఖిల్ తెగ ఫీలైపోయాడు. మోనాల్ ఏ పాట పాడుతుందో గెస్ చేయండంటూ అఖిల్ పోస్ట్ చేశాడు. వీరిద్దరి రిలేషన్ కు సంబంధించి మీడియాలో పలు వార్తలు వస్తుంటాయి. కానీ ఎప్పుడూ కూడా వాటిపై స్పందించలేదు ఈ జంట. ఇక తాజాగా అఖిల్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చాడు. ఈ సందర్భంగా అభిమానులందరూ మోనాల్ ను యాడ్ చేయమని అడిగారు.

దీంతో అఖిల్.. మోనాల్ కు రిక్వెస్ట్ పంపించాడు. ఆన్‌లైన్ లో ఉన్నప్పటికీ మోనాల్ మాత్రం అఖిల్ రిక్వెస్ట్ కు స్పందించలేదు. మోనాల్ వీడియోలోకి రాకపోయినా కామెంట్లు పెడుతూ అఖిల్ ను ఓ రేంజ్ లో ఆడుకుంది. షర్ట్ బటన్ పెట్టుకోకుండా బాడీను ప్రదర్శిస్తూ ఉండడం చూసి అఖిల్ మీద ఫైర్ అయింది మోనాల్. బటన్ పెట్టుకో అంటూ అఖిల్ కి వార్నింగ్ ఇచ్చింది. టీషర్ట్ బాగుందని మరో కామెంట్ పెట్టింది. అయితే అది టీషర్ట్ కాదని.. షర్ట్ అని అఖిల్ కౌంటర్ ఇచ్చాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.