English | Telugu

సుమ ఎక్క‌డ‌? ఆ షో నుండి తప్పుకుందా..?

బుల్లితెరపై యాంకర్ సుమ టాప్ యాంకర్ గా దూసుకుపోతున్నారు. 'సుమ‌క్క' స్థాయి నుంచి 'సుమ ఆంటీ' స్థాయికి వ‌చ్చినా ఆమె క‌రిష్మాలో మార్పేమీ లేదు. ఆమె ఏ షోని హోస్ట్ చేసినా అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈటీవీలో 'క్యాష్', 'స్టార్ మహిళ' షోలతో పాటు స్టార్ మాలో కొన్ని షోలు.. అలానే జీ తెలుగులో 'బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్' అంటూ చాలా బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు జరగడం లేదు. టీవీలో టెలికాస్ట్ చేస్తున్నవి కూడా లాక్‌డౌన్‌కు ముందు షూట్ చేసినవే.

ఇదిలా ఉండగా.. యాంకర్ రవితో కలిసి సుమ 'బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్' షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేసే సందడి మాములుగా ఉండదు. ప్రతి వారం సెలబ్రిటీలను ఈ షోకి తీసుకొస్తూ రకరకాల ఛాలెంజ్ లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు. తాజాగా ఈ షోకి 'డ్రామా జూనియర్స్‌' పిల్లలు వచ్చాయి. ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ లో స్పెషల్ అప్పియరెన్స్ గా 'గల్లీ బాయ్స్' సద్దాం వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ షోలో సుమ ఎక్కడా కనిపించలేదు. సుమ లేకుండా వచ్చిన మొదటి ప్రోమో ఇదే. సుమ ఎందుకు కనిపించలేదు..? అంటూ నెటిజన్లు ఈ ప్రోమోపై కామెంట్స్ చేస్తున్నారు. లాక్ డౌన్ కంటే ముందుగానే ఈ ఎపిసోడ్ జరిగినా.. సుమ రాకపోవడానికి కారణం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సుమ ఈ షో నుండి తప్పకున్నారా..? లేక వేరే కారణాలతో హాజరు కాలేకపోయారా..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సివుంది!

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.