English | Telugu

నిన్న 'మందారం'.. నేడు 'తార‌'.. హిమ‌జ గ్యారేజ్‌లో మ‌రో కొత్త కారు!

బిగ్ బాస్ షో తరువాత చాలా మంది కంటెస్టెంట్లకు మంచి పేరొచ్చింది. వారిలో హిమజ ఒకరని చెప్పాలి. అప్పటివరకు పలు సీరియల్స్, సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు పోషించిన ఈ నటికి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది హిమజ. తనకు వచ్చిన పాపులారిటీతో ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసింది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన చాలా మంది కంటెస్టెంట్ లు యూట్యూబ్ ఛానెల్స్ ను ఓపెన్ చేశారు కానీ హిమజ ఛానెల్ కి రోజురోజుకి స‌బ్‌స్ర్కైబ‌ర్స్ బాగా పెరుగుతున్నారు.

హిమజ బ్రేక్ ఇవ్వకుండా సెలబ్రిటీలకు చెందిన వీడియోలతో పాటు, వంటలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తోంది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తరువాత కొత్త ఇంటిని కొనుక్కున్న హిమజ కొద్ది రోజుల క్రితం బెంజ్ కారు కూడా కొనుక్కుంది. ఆ సమయంలో ఆమెని చాలా మంది లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేయగా.. లోన్ తీసుకొని కారు కొన్నానని.. నెల నెలా ఈఎంఐ కట్టడానికి కష్టపడి పని చేస్తున్నానని హిమజ చెప్పింది.

ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా హిమజ మరో కారు కొనుక్కుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మహీంద్ర థార్‌ వాహనాన్ని సొంత చేసుకున్న హిమజ ఈ కారుకి 'తార' అనే పేరు కూడా పెట్టేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ కారు ధర రూ.13 నుండి రూ.15 లక్షల వరకు ఉంటుందని సమాచారం. మునుపు కొనుక్కున్న బెంజ్ కానీ, ఇప్పుడు కొన్న మ‌హీంద్ర థార్ కానీ రెడ్ క‌ల‌ర్‌వే. "ఐ ల‌వ్ రెడ్" అని చెప్తోంది హిమ‌జ‌.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.