English | Telugu
ఢీ జోడి సీజన్ లో డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అదుర్స్...
Updated : Dec 27, 2024
ఢీ జోడి షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షో సంథింగ్ డిఫెరెంట్ గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు షోస్ అన్నీ మూసగా, ఒకటే రకం డాన్స్ లు ఒకటే రకం ఎక్స్ప్రెషన్స్ ఏదో డాన్స్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టుగా సాగిపోయాయి. కానీ ఈ సీజన్ మాత్రం కొత్త కంటెస్టెంట్స్ అందరూ సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావడం కొత్తగా పెర్ఫార్మ్ చేయడం..ఏ వారానికి ఆ వారం ఫైనల్ ఎపిసోడ్ అన్నట్టుగా డాన్స్ చేసి ఆడియన్స్ మనసులను గెలుచుకుంటున్నారు. ఇక ఈ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే గనక ఒక్కో జోడి ఒక్కో రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి వావ్ అనిపించుకున్నాయి. ఈ ఢీ జోడిలో సూర్యతేజ - హంస డాన్స్ చూస్తే ఎవ్వరైనా ఫ్లాట్ ఐపోవాల్సిందే.
కొత్త కొత్త స్టెప్స్ తో అందరినీ అట్ట్రాక్ట్ చేసేలా పెర్ఫార్మ్ చేయడంతో అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇక గణేష్ మాష్టర్ కి ఈ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చేసింది. ఒకవేళ ఇది సెమి ఫైనల్ అయ్యుంటే ఈ జోడి ఫైనల్ కి వెళ్ళేవాళ్ళు. అదే ఫైనల్ ఐతే వీళ్ళే గెలిచేవాళ్ళు అని చెప్పేసారు. ఇక ఈ జోడి ఫైనల్ గా కేక్ తెచ్చి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసారు. ఢీ షో మళ్ళీ వచ్చింది. డాన్స్ వావ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ సూపర్ గా ఉండబోతోంది అంటున్నారు. పార్టీ థీమ్ కాన్సెప్ట్ తో జోడీస్ అన్ని డాన్స్ చేశాయి. అనీష్ - ఆప్తి, చందన్ - తులసి, బబ్లు - అద్విత ఈ జోడీస్ అన్నీ కూడా వేటికవే పోటీ పడుతున్నాయి.