Read more!

English | Telugu

ఢీ సీజన్ 16 ఆడిషన్స్ స్టార్ట్!

బుల్లితెర మీద అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా ప్రారంభమై విజయవంతంగా దూసుకెళ్తోంది    “ఢీ” డాన్స్ షో. ఇప్పటికి 15 సీజన్స్ పూర్తి చేసుకున్న ఢీ సీజన్ 16 తో ఆడియన్స్ ముందుకు రావడానికి  రెడీ అవుతోంది. ఈ కొత్త సీజన్ కి సంబంధించి ఆడిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు షో మేకర్స్. ఇప్పుడు జరుగుతున్న ఢీ సీజన్ 15 సెమీ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇందులో గెలిచినా వాళ్ళతో ఫైనల్స్ లోకి వెళ్లేందుకు రెడీ అయ్యింది. కాబట్టి ఈ సీజన్ త్వరలో ఎండ్ కాబోతోంది అనే విషయం తెలుస్తోంది. అందుకే ఇప్పుడు కొత్త సీజన్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు.

డాన్స్ లో మంచి టాలెంట్ ఉన్నవాళ్లకు ఇదో మంచి అవకాశం..వేదిక అని చెప్పొచ్చు. 18 - 30 ఏళ్ళ వయసున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఈ ఆడిషన్స్ కి రావొచ్చు అని అనౌన్స్ చేశారు. ఈ ఆడిషన్స్ మే 18 న కర్నూల్ లో సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీలో, అలాగే కరీంనగర్ లో ఫిలిం భవన్ ఎదురుగా ఉన్న ప్రతిమ మల్టీప్లెక్స్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరగబోతున్నాయి అని చెప్పారు. 15  సంవత్సరాలుగా ఆడియన్స్ ని డాన్స్ లవర్స్ ని అట్ట్రాక్ట్ చేస్తున్న ఈ షో ఇప్పుడు సీజన్ 16 లోకి అడుగుపెట్టబోతోంది. అలాగే ఈ ఆడిషన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కోసం 7670882334 లో సంప్రదించవచ్చని చెప్పారు. మరి కొత్తవాళ్లు ఈ ఆడిషన్స్ కి వెళ్లి మీ టాలెంట్ ని ఈ ప్రపంచానికి పరిచయం చేయండి.