Read more!

English | Telugu

తను ఇచ్చిన లెటర్ లో మురారిని దేవుడని రాసిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -158 లో.. మురారి పుట్టినరోజు సందర్భంగా భవాని వాళ్ళందరూ గుడికి వెళ్ళి.. ఆ తర్వాత రెస్టారెంట్ కి వెళ్తారు. అందరూ కూర్చొని ఉండగా.. భవాని ఆర్డర్ చేస్తుంది. మురారి హ్యాండ్ వాష్ కి వెళ్తాడు. మురారి వెనకాలే ముకుంద కూడా వెళ్తుంది. మురారి హ్యాండ్ వాష్ చేస్తూ.. ముకుంద తొడిగిన రింగ్ తీసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే మురారి దగ్గరికి ముకుంద వచ్చి.. తియ్యకని అంటుంది. ఆదర్శ్ రాడు.. నీకు కృష్ణతో ఏ బంధం లేదు.. మీరు సంతోషంగా ఉంటే  నా ప్రేమని నా మనసులోనే చంపుకునేదాన్ని కానీ మీరు సంతోషంగా లేరు. దేవుడి గుడిలో మన ఎంగేజ్ మెంట్ అయింది. ఈ రింగ్ ని తియ్యకు.. ఇక్కడ నుండి వెళ్ళు అని ముకుంద అనగానే మురారి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుంటారు. రోజు రేవతి నీకు వడ్డిస్తుంది.. ఈ రోజు నేను నీకు వడ్డిస్తానంటూ మురారికి వడ్డిస్తుంది భవాని. చాలు పెద్దమ్మ అంటూ మురారి తన చేతిని అడ్డు పెడతాడు. అప్పుడే మురారి వేలికి ఉన్న రింగ్ ని అందరూ చూస్తారు. రింగ్ ఎక్కడిదని రేవతి అడుగుతుంది. ఉదయం గుడికి  వెళ్ళేటప్పుడు రింగ్ లేదు.. ఇప్పుడు ఉందేంటని కృష్ణ అడుగుతుంది. ఎవరు గిఫ్ట్ ఇచ్చారని భవాని అంటుంది. మురారి ఇబ్బంది పడుతూ ఉదయం గుడికి డీజీపీ సార్ వచ్చారు కదా.. తను గిఫ్ట్ ఇచ్చాడని కవర్ చేస్తాడు. ఇక అందరూ రెస్టారెంట్ నుండి బయలుదేరుతారు. ఆ తర్వాత కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ ని తన గదిలో కూర్చుని ఓపెన్ చేస్తాడు మురారి.

కృష్ణ ఒక పర్సు.. అందులో మనీ, ఒక లెటర్ గిఫ్ట్ గా ఇస్తుంది. లెటర్ ఓపెన్ చేసి చూస్తే.. మీరు ఎప్పటికీ నా దేవుడని రాసి ఉంటుంది. అది చూసిన మురారి.. నన్ను ప్రేమగా మాత్రం చూడట్లేదని ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ముకుంద తొడిగిన రింగ్ ని తీసి పడేస్తాడు మురారి. మరొకవైపు కృష్ణ పాయసం చేసి భవానికి ఇస్తుంది. మురారిని తీసుకొనిరా అని భవాని చెప్పగానే కృష్ణ తీసుకురావడానికి వెళ్తుంది. అంతలోనే మురారి పైనుండి కిందకి వస్తూ పడిపోతుంటే కృష్ణ పట్టుకుంటుంది. ఏంటి మురారి చూసుకోవాలి కదా అని భవాని అంటుంది. నేను పని మీద బయటకు వెళ్తున్నాను.. నువ్వే అన్ని చూసుకోవాలని మురారితో భవాని చెప్పేసి వెళ్తుంది.

మురారి కావాలనే వేలికి ఉన్న రింగ్ ని తీసేసినట్లు తెలియాలని.. ముకుందకి కనిపించేలా చేతిని చూపిస్తుంటాడు. ముకుంద ధైర్యంగా నా వేలికి రింగ్ పెట్టగా లేంది. నా ప్రేమని కృష్ణకి తెలిసేలా చెయ్యలేనా అని మురారి మనసులో అనుకుంటాడు. మురారి వేలికి రింగ్ లేకపోవడంతో.. ముకుంద బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మురారి నువ్వు ఎంతలా మారిపోయావంటూ బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.