English | Telugu

లక్ష రూపాయలతో జుట్టు పెట్టించాను జాగ్రత్త


ఉగాది వెళ్ళిపోగానే శ్రీరామ నవమి వచ్చేస్తుంది. ఇక బుల్లితెర మీద శ్రీరామనవి కొత్త షోస్ రెడీ అయ్యాయి. సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రొమోషన్స్ కోసం వచ్చాడు. ఐతే రాంప్రసాద్, ప్రదీప్, గెటప్ శీను కలిసి ఒక స్కిట్ వేశారు. రాంప్రసాద్ తో తెలుగు కాదు ఒక కొరియా సినిమా ప్లాన్ చేసాం అన్నాడు ప్రదీప్. వెంటనే రాంప్రసాద్ "ఏంటి మన డైరెక్టర్ నాకంటే ఎక్కువ గ్లామర్ గా ఉన్నాడు. కొంచెం గ్లామర్ తగ్గించుకో" అన్నాడు ప్రదీప్ ని . వెంటనే ప్రదీప్ గుండ్రంగా తిరిగి ముఖం మీద కొంచెం మేకప్ ని చెరిపేసుకున్నాడు.

దానికి రాంప్రసాద్ శాటిస్ఫై అయ్యాడు. "నీకు గ్లామర్ తగ్గింది సరే మరి నాకు గ్లామర్ పెరగాలంటే ఎం చేయాలి" అని అడిగాడు. దానికి ప్రదీప్ వెంటనే రాంప్రసాద్ జుట్టును పట్టుకుని వెంట్రుకలను మెలేస్తూ నుదురు మీదకు ఎగిరేలా ట్రై చేసాడు. దానికి రాంప్రసాద్ ఫీలయ్యాడు. వద్దొద్దు అనేసరికి "ఇంకొంచెం గ్లామర్ పెంచుతా...అసలే మీకు మొహమాటం ఎక్కువ అంటూ ఇంకో వెంట్రుక తీసి దాన్ని నుదుటి మీదన మెలేసి ఉమ్ము తీసి ఆ వెంట్రుకకు నుదుటికి అంటించాడు. శోభన్ బాబు రింగ్ లా అన్నమాట. లక్ష రూపాయలతో పెట్టించానయ్యా ఈ జుట్టును అంటూ తెగ బాధపడ్డాడు రాంప్రసాద్. "అందులో ఈ శోభన్ బాబు రింగ్ 50 వేలులా ఉంది" అన్నాడు నవ్వుతూ. తర్వాత రాంప్రసాద్ ఆల్మోస్ట్ పాతిక అంటూ జుట్టు గురించి ఏదో చెప్పబోతుంటే గెటప్ శీను వచ్చి రాంప్రసాద్ ను లాగిపెట్టి కొట్టి "బాగుందని చెప్తుంటే చల్ " అంటూ అరిచిపడేశాడు. దానికి రాంప్రసాద్ కొంచెం ఎక్కువగానే హర్ట్ ఐనట్టు కనిపించాడు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.