English | Telugu

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

బాంబ్ స్కాడ్ వాళ్ళు స్టేషన్ కి వచ్చి చెక్ చేస్తారు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వాళ్ళు అంటారు. పక్కన చూస్తే రాజ్ ఉండడు. దాంతో ఇదంతా రాజ్ పని అని ఇన్‌స్పెక్టర్ కి అర్థం అవుతుంది. వెంటనే ఇన్‌స్పెక్టర్ అప్పుకి కాల్ చేసి మీ బావ స్టేషన్ నుండి తప్పించుకున్నాడని.. అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చే బాధ్యత నీదే అని అంటాడు. సర్ నేను లీవ్ లో ఉన్నానని అప్పు అంటుంది. లీవ్ లో ఉంటే ఏంటి నీ డ్యూటీ నువ్వు చెయ్ అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. ఆ తర్వాత రాజ్ హాస్పిటల్ కి వస్తాడు. నా భార్యని కాపాడుకోవడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం ఏం కన్పించలేదని స్టేషన్ నుండి తప్పించుకొని వచ్చానని రాజ్ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు.

రాజ్ లోపలకు వెళ్తుంటే.. ఆగండి మీరు మీ భార్య దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు స్టేషన్ నుండి తప్పించుకొని మరొక తప్పు చెయ్యొద్దని అప్పు అనగానే అనగానే అందరు షాక్ అవుతారు. నాకు మిమ్మల్ని అరెస్ట్ చెయ్యమని ఆర్డర్ వచ్చిందని అప్పు అనగానే అందరు అప్పుపై కోప్పడతారు. ఎలా అరెస్ట్ చేస్తావో చెయ్ అని అందరు రాజ్ కి అడ్డుగా నిలబడగా కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి మాట్లాడతాడు. రాజ్ ని చూసి ఒక క్రిమినల్ ఇక్కడ ఉంటే మా హాస్పిటల్ కి బ్యాడ్ నేమ్ అని డాక్టర్ అంటుంటే.. ప్లీజ్ డాక్టర్ అలా అనొద్దు.. ప్లీజ్ ఆపరేషన్ చెయ్యండి అని రాజ్ రిక్వెస్ట్ చేస్తాడు. తరువాయి భాగంలో కావ్యకి ఆపరేషన్ చేస్తారు. కావ్యకి పాప పుడుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.