English | Telugu

బిగ్ బాస్ హౌస్‌లో 'చిన్నారి పెళ్లికూతురు' నటి!

కరోనా పరిస్థితుల కారణంగా బిగ్ బాస్ షోకు అంతరాయం కలుగుతోంది. ఇటీవల సీక్రెట్ గా షూటింగ్ జరిపిన మలయాళ బిగ్ బాస్ సెట్ కు తాళం వేశారు అధికారులు. అయితే ఇప్పుడు హిందీ బిగ్ బాస్ షోను ప్రసారం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షోకి సంబంధించి మీడియాలో ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. కొద్ది నెలల క్రితమే సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించే బిగ్ బాస్ హిందీ 14 ముగిసింది. ఇప్పుడు సీజన్ 15 కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను కంటెస్టెంట్ లుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రిటీలకు సంబంధించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ నేహా మర్దా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బిగ్ బాస్ షోలో పాల్గొనాలని మంచి ఆఫర్ ఇచ్చారని.. గత నాలుగేళ్లుగా తనను షో గురించి సంప్రదిస్తున్నారని .. కానీ కొన్ని కారణాల వలన వారి ఆఫర్ అంగీకరించలేదని చెప్పింది. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియ‌ల్‌లో ఆమె వ‌సంత్ మాజీ రెండో భార్య‌గా, నిరంజ‌న్ భార్య‌గా న‌టించింది.

తాజాగా బిగ్ బాస్ 15 కోసం సంప్రదించిన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. ఒకే గదిలో జీవితం కొనసాగించలేనని అనుకునేదాన్నని.. కానీ ఇప్పుడు లాక్ డౌన్ జీవితం మినీ బిగ్ బాస్ లా ఉందంటూ కామెంట్ చేసింది నేహ‌. ఒకవేళ తను గనుక బిగ్ బాస్ షోకి వెళితే.. ట్రోఫీ తనే అందుకుంటాననే నమ్మకం ఉందని తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది బిగ్ బాస్ హౌస్ లో ఈ బ్యూటీ ఎంటర్ అవ్వడం ఖాయం.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.