Read more!

English | Telugu

తనపై ఎటాక్ చేయించింది ఎవరో రిషి కనిపెట్టగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-758 లో.. ఇంటి మేడ మీద జగతి ఒక్కతే కూర్చొని ఏడ్వడం చూసిన మహేంద్ర, వసుధారలు తన దగ్గరికి వెళ్తారు. ఏమైందని అడిగితే చెప్పకుండా నడుస్తుంది జగతి. ఆ తర్వాత రిషి మేడ మీదకి రాగానే.. జగతి తనని హగ్ చేసుకొని ఏడుస్తుంది. రిషి ఎన్నిసార్లు ఏమైందని అడిగినా ఏం సమాధానం చెప్పకుండా ఏడుస్తుంటుంది జగతి. కాసేపటికి వసుధార జగతిని అర్థం చేసుకొని.. రిషి, మహేంద్రలని కిందకి వెళ్ళమని చెప్తుంది. నేను ఏం జరిగిందో తెలుసుకొని వస్తాను మీరు వెళ్ళండని వాళ్ళిద్దరికి చెప్తుంది వసుధార. ఆ తర్వాత వసుధార ఏమైందని జగతిని అడుగగా.. నేను ఇప్పుడు చెప్తే ఎవరూ ప్రాణాలతో మిగలరని జగతి తన మనసులో అనుకుంటుంది. కానీ బయటకు ఏమీ చెప్పదు.

అయితే  మేడ మీద నుండి కిందకి వెళ్ళిన రిషి, మహేంద్రలు హాల్ లో కూర్చుంటారు. అప్పుడే అక్కడికి దేవయాని వస్తుంది. వాళ్ళిద్దరిని అలా చూసిన దేవయాని ఏమైందని అడుగుతుంది. వాళ్ళిద్దరు మౌనంగా ఉంటారు. అప్పుడే మేడమీద నుండి కన్నీళ్ళు తుడ్చుకుంటూ జగతి వస్తుంది. తనని చూసిన దేవయాని.. ఏంటి దేవయాని ఏడుస్తుందని అడుగగా.. నా మీద జరిగిన ఎటాక్ ని తల్చుకొని బాధపడుతుందని రిషి అంటాడు. ఆ తర్వాత కాలేజీలోని సీసీటీవి ఫుటేజ్ తెప్పించి చూద్దామని రిషితో మహేంద్ర అంటాడు. సరేనని చెప్పి తెప్పించి‌‌.. రిషిపై ఎటాక్ చేసింది ఎవరో తెలుసుకుంటారు‌. అంతకముందు రిషి, వసుధారలని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ లో వాడు కూడా ఉన్నాడనే నిర్దారణకి వస్తాడు రిషి. ఆ తర్వాత వాళ్ళ వెనుక ఎవరున్నారో కనుక్కోమని, అలాగే శైలేంద్రని రిషికి తోడుగా ఉండమని ఫణీంద్ర అంటాడు.  

అలాగేనని రిషి, శైలేంద్ర ఆ ఎటాక్ చేసినవాడిని పట్టుకుంటారు.ఎటాక్ చేసిన వాడిని తాళ్ళతో కట్టేసి కొడుతుంటాడు రిషి. నీ వెనుక ఎవరున్నారు? ఎందుకు నన్ను చంపాలనుకున్నావని ఎంత అడిగినా వాడు నిజం చెప్పడు. దాంతో రిషి ఎమ్.ఎస్.ఆర్ మీద అనుమానపడతాడు. ఆ తర్వాత ఎమ్.ఎస్.ఆర్ కి కలవాలని ఒక ప్లేస్ కి రమ్మని అక్కడ కలుసుకుంటారు. అక్కడ రిషి, శైలేంద్ర కలిసి ఎమ్.ఎస్.ఆర్ ని తిడుతూ మాట్లాడతారు. నాతో మర్యాదగా మాట్లాడండి.. నేనేదో మీ కాలేజీ మీద ఆశపడ్డానని.. నేనే మిమ్మల్ని చంపాలని చూసానని ఎలా అనుకుంటారు. నేనేమీ తప్పు చేయలేదు.‌.ఎక్కడిదాకా అయినా వస్తాను.. కావాలంటే కోర్ట్ లో చూసుకుందామని ఎమ్.ఎస్.ఆర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.