English | Telugu

Bigg Boss 9 Telugu 10th week: సంఛాలక్ గా రీతూ ఫెయిల్.. డీమాన్ కి ఫుల్ సపోర్ట్!

బిగ్ బాస్ హౌస్ లో పదో వారం ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో కంటెస్టెంట్స్ ని బీబీ రాజ్యంగా డిసైడ్ చేశారు. ఇందులో రాణి, రాజులు, ప్రజలుగా కంటెస్టెంట్స్ ని డివైడ్ చేసి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కమాండర్స్‌లో ఒకరు వాళ్ల స్థానాన్ని రిస్క్‌లో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వారితోటి పోరాడాల్సి ఉంటుంది. ఈ పోటీలో వాళ్లు విజయం సాధిస్తే కమాండర్‌గా తమ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు వాళ్ల స్థానాన్ని తీసుకొని కొత్త కమాండర్ అవుతారు. ఇక కమాండర్స్ నలుగురిలో ఎవరు ప్రజలతో పోరాడతారో తెలుసుకోవడానికి ముందుగా ఒక పరీక్ష పెట్టాడు. అందులో ఓడిపోయినవారు ప్రజలతో పోటీపడాల్సి ఉంటుంది.. ఇందుకోసం కమాండర్స్‌కి 'విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్' అనే గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్కులో భాగంగా బాస్కెట్లను కమాండర్స్ బ్యాగులో వెనకవైపు ధరించాలి.. బెల్ మోగగానే ట్రేలో ఉన్న బాల్స్‌ని తీసుకొని ఇతర కమాండర్ల బాస్కెట్లలోకి వేయాలి.. ప్రతీ రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్లో తక్కువ బాల్స్ ఉంటాయో వారు సేఫ్ అయి తమ కమాండర్ స్థానాన్ని కాపాడుకొని ఆట నుంచి తప్పుకుంటారు. చివరి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్‌లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్లు తన స్థానాన్ని రిస్క్‌లో పెట్టి ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది.. గేమ్ మొత్తం బ్లూ లైన్‌కి లోపలే ఉండి ఆడాలంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. రీతూ ఈ గేమ్‌కి సంఛాలక్‌ గా ఉంది. అయితే ఫస్ట్ రౌండ్‌లోనే తనూజ మీదకి రావడంతో డీమాన్ అనుకోకుండా లైన్ దాటేశాడు. కానీ రీతూ నువ్వు నెట్టేశావంటూ తనూజపై ఫైర్ అయి డీమాన్‌ని ఆడించేసింది.

సేమ్ అదే రౌండ్‌లో నిఖిల్ కూడా లైన్ క్రాస్ చేసినా రీతూ మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత డీమాన్ మళ్లీ ఔట్ అయ్యాడు. అయినా కానీ రీతూ వార్నింగ్ అంటూ ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. ఇలా డీమాన్‌ని గెలిపించడానికే రీతూ సంఛాలక్ అయినట్లుగా అనిపించింది. అయితే ఫస్ట్ రౌండ్‌లో తక్కువ బాల్స్ ఉన్న నిఖిల్ సేఫ్ అంటూ రీతూ ఫస్ట్ అనౌన్స్ చేసింది. కానీ బిగ్‌బాస్ మళ్లీ అడగ్గానే నిఖిల్ ఈ రౌండ్‌లో బయటికెళ్లిపోయాడు కనుక తనూజ సేవ్ అయిందని చెప్పింది. ఆ తర్వాత రౌండ్‌లో డీమాన్ సేఫ్ కాగా, చివరి రౌండ్‌లో నిఖిల్ గెలిచాడు. ఇలా సంఛాలక్ రీతూ తీసుకున్న డెసిషన్స్ వల్ల సంజనతో పెద్ద గొడవ అయింది. మరి ఊ టాస్క్ లో రీతూ సంఛాలక్ గా ఫెయిలో కాదో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.