English | Telugu

నాకు బ‌ట్ట‌లు కుట్టిస్తారా?

బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వస్తోంది. సీజన్ 3లో పాల్గొన్న చాలా మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో బాగా ఫేమస్ అయ్యారు. సినిమా అవకాశాలు పెద్దగా రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ వచ్చింది. అలాంటి వారిలో అలీ రెజా ఒకరని చెప్పాలి. బుల్లితెర, వెండితెర పలు ఆఫర్లతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇటీవల నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' సినిమాలో కీలకపాత్ర పోషించాడు అలీ రెజా. అయితే ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న అలీ.. తన కొత్త సినిమా అప్డేట్ ను ఇచ్చాడు. 'G.D' అంటూ వదిలిన సినిమా పోస్ట్ బాగానే క్లిక్ అయింది. తాజాగా అలీ తన అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చట్లు పెట్టాడు.

ఈ క్రమంలో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. ఇందులో కొందరు వ్యక్తిగత విషయాలను కూడా అడిగారు. 'ముద్దు పేరు ఏంటి..?', 'వదినను అసలు చూపించడం లేదేంటి..?' లాంటి ప్రశ్నలు అడగగా.. చిన్నతనం నుంచి అందరూ త‌న‌ను అలీ అనే పిలుస్తారని, కానీ పెళ్లి తరువాత తన భార్య బాబు అని పిలుస్తోంద‌నీ తెలిపాడు. ఇక ఓ నెటిజన్ ఏకంగా బాడీ కొలతలు అడిగాడు. దానికి అలీ రెజా.. 'నాకు బట్టలు కుట్టిస్తారా ఏంటి..?' అంటూ సెటైర్ వేశాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.