English | Telugu

రౌడీ శౌర్య షేర్ చేసిన వీడియోకు నెటిజ‌న్లు ఫిదా! ‌

స్టార్ మా‌లో ప్ర‌సారం అవుతున్న నంబ‌ర్ వ‌న్ తెలుగు సీరియ‌ల్ 'కార్తీక‌దీపం'. ఈ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క దీప‌గా న‌టించిన కేర‌ళ కుట్టి ప్రేమి విశ్వ‌నాథ్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. అదే స్థాయిలో ఈ సీరియ‌ల్‌లో దీప కూతురు శౌర్య‌గా న‌టించిన బేబీ కృతిక‌ కూడా అంతే పాపుల‌ర్ అయింది. త‌న చిట్టి పొట్టి మాట‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న కృతిక‌ తాజాగా చేసిన ప‌నికి నెటిజ‌న్‌లు ఫిదా అయిపోయారు.

శ‌భాష్ రౌడీ అంటూ కృతిక‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బుల్లితెర‌పై రాణిస్తున్న ఈ రౌడీ బేబీలో సామ‌జిక స్పృహ ఎక్కువే. ఈ వ‌య‌సులోనే న‌లుగురికి సాయ‌ప‌డాల‌ని గొప్ప మ‌న‌సుని చాటుకుంటోంది. వివిధ సేవా కార్య‌క్ర‌మాల‌తో పాపుల‌ర్ అయి త‌న‌లోని సేవా నిర‌తిని చాటిన కృతిక తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ వీడియో సందేశాన్ని అందించింది.

రానున్న ఎండ‌ల్ని దృష్టిలో పెట్టుకుని ప‌క్షుల‌కు ప‌రిప‌డా నీరు, ఆహారం అందేలా మీ టెర్రెస్‌పై ఏర్పాటు చేయండ‌ని సందేశాన్ని అందిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ చిన్నారి ఆలోచ‌న‌కు మెచ్చిన నెటిజ‌న్స్ అంతా ఫిదా అయిపోయారు. ఇంత చిన్న వ‌య‌సులో ఎంత సామాజిక స్పృహ అంటూ కృతిక‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.