Read more!

English | Telugu

బాబు లైట్స్ ఆఫ్ చేయకండి మహతి అసలే చాలా స్పీడ్...

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో ఫుల్ నవ్వు తెప్పించేసింది. ఒక అపార్ట్మెంట్ లో ఉండే ఆంటీస్ వెర్సస్ అంకుల్స్ మధ్య ఈ షో నడిచింది. ఐతే ఆంటీస్ వెర్సస్ అంకుల్స్ అని కాకుండా రామ్ ప్రసాద్ వెర్సెస్ మహతి అని ఈ ఎపిసోడ్ కి టైటిల్ పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇందులో ప్రతీ సెగ్మెంట్ లో కూడా మహతి రామ్ ప్రసాద్ మధ్యనే జరిగాయి. మొదట ఒక టాస్క్ ఇచ్చింది అంకుల్స్ కాళ్ళ మీద ఆంటీస్ కాళ్ళు పెట్టి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బెలూన్స్ కి తీసుకెళ్ళాలి.

ఎన్ని బెలూన్స్ తీసుకెళ్తారో వాళ్ళు విన్ ఐనట్టు. ఇందులో మహతి వెర్సెస్ రామ్ ప్రసాద్ వచ్చారు. మొదటి సారి రామ్ ప్రసాద్ కళ్ళల్లో భయం చూస్తున్నా అని ఇంద్రజ కామెంట్ చేసేసరికి రామ్ ప్రసాద్ నవ్వేసాడు. "నాకు రామ్ ప్రసాద్ అంటే చాలా ఇష్టం నన్ను ఎత్తుకుంటే ఎంత ఇష్టమో చూపిస్తాను" అంది మహతి. "ఈ గేమ్ మధ్యలో లైట్స్ అవీ ఆఫ్ చేయకండి. మహతి అసలే చాలా స్పీడ్ గా ఉంటుంది" అని రామ్ ప్రసాద్ ముందు జాగ్రత్త పడ్డాడు. ఇక ఈ గేమ్ సరిగా ఆడలేదు రామ్ ప్రసాద్. రొమాన్స్ , గేమ్ రెండూ తక్కువగానే ఉన్నాయని చెప్పింది రష్మీ. తర్వాత ఫైనల్ గా ఎలాగో మహతి రామ్ ప్రసాద్ ని గట్టిగా అరిచి అతని కాళ్ళ మీద ఎక్కి కాస్త దూరం నడవడానికి ట్రై చేసింది. ఇక తర్వాత ఫైనల్ లో ఒక సెగ్మెంట్  ఇచ్చింది రష్మీ. థ్రెడ్ మిల్ మీద డాన్స్ చేయాలి అని చెప్పింది. రామ్ ప్రసాద్ ఆ థ్రెడ్ మిల్ స్పీడ్ ని పెంచే కొద్దీ మహతి దానికి తగ్గట్టు డాన్స్ చేసి తానేంటో నిరూపించుకుంది. ఇక ఈ థ్రెడ్ మిల్ ఆపేసాక రాంప్రసాద్ ఆమె మీద కామెంట్స్ చేసాడు.. "ఆమె డాన్స్ స్పీడ్ కి థ్రెడ్ మిల్ బెల్ట్ కూడా స్టక్ ఐపోతుంది" అన్నాడు. ఇలా వీళ్ళ మధ్య జరిగిన మంచి కామెడీ సీన్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వుకునేలా చేసాయి.