Read more!

English | Telugu

కార్తీకదీపం 2 లో మోనితను తీసుకురావాలంటున్న ఫాన్స్...


కార్తీకదీపం సీజన్ 2 సీరియల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సీరియల్ మీద చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆల్రెడీ ఇందులో డాక్టర్ బాబు కార్తీక్, వంటలక్క దీప కనిపించేసారు. కానీ డాక్టర్ బాబు లవర్ మోనిత గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఐతే ఇప్పటివరకు లేదు. ఇక చాలామంది కూడా మోనిత ఉంటే బాగుంటుంది అని అంటున్నారు.

ఇక తనకు కూడా ఈ కామెంట్స్ చాలా ఎదురవుతున్నాయని అసలు తన క్యారెక్టర్ ఉంటుందా లేదా అని చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ అడుగుతున్నారంటూ రీసెంట్ గా తన యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పింది. "నేను కార్తీక దీపం 2 ప్రోమో చూసాను. నాకు వంటలక్క, డాక్టర్ బాబు రోల్స్ అంటే చాలా ఇష్టం. చాలామంది కూడా విలన్ గా నన్ను చూడాలనుకుంటున్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. ఐతే మీరు నా మీద చూపించిన ప్రేమ, అభిమానం వల్లనే నా కెరీర్ మొత్తం చాలా హ్యాపీగా సాగిపోతోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు కూడా నాగ్ సర్ కూడా శోభాలా మాట్లాడుతున్నావా, మోనితలా మాట్లాడుతున్నావా అని అడిగారు.

ఇప్పటి వరకైతే నేను కార్తీక దీపం 2 లో లేను. ఎందుకంటే ఏదైనా సీరియల్ లో ఒక రోల్ ది బెస్ట్ ఐపోతుంది. అలాంటి రోల్ మొనీతది.. బిగ్ బాస్ హౌస్ తర్వాత ఏదైనా సీరియల్ చేయాలి ఇమ్మిడియట్ గా అని అనుకోలేదు. కార్తీక దీపం 2 నేను ఉన్నాను అన్న విషయం మీద నాకు ఇప్పటి వరకు ఏ కాల్ కూడా రాలేదు. ఒకవేళ సీరియల్ నుంచి కాల్ వస్తే అందులో కూడా మోనిత్ రోల్ డాక్టర్ బాబు, వంటలక్కకు పోటీగా ఉంటే నాకు నచ్చితే చేసే అవకాశం ఉంది." మరి నెటిజన్స్, కార్తీక దీపం ఫాన్స్ అంతా కూడా మోనితను సీరియల్ లోకి తీసుకురండి, స్టోరీ మంచి సక్సెస్ అవుతుంది అని అడుగుతూ కామెంట్స్ చేస్తున్నారు.