Read more!

English | Telugu

బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారో తెలుసా?

జబర్దస్త్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. ఇందులో స్కిట్స్ ఈ వారం మంచిగా ఎంటర్టైన్ చేయబోతున్నాయనే విషయం తెలుస్తోంది. రాకెట్ రాఘవ స్కిట్ అంటే చాలు అందులో ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ గా , కొంచెం విజ్ఞానదాయకంగా, ఎవరినీ నొప్పించకుండా ఉంటాయి. ఈ వారం కూడా అలాంటి స్కిట్స్ నే పెర్ఫామ్ చేసారు. స్టేజి మీదకు రావడమే రాఘవను "బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు" అని ఆయన స్కిట్ లోని ఒక కమెడియన్ అడిగాడు. "మహిళా గ్యారేజీ" అంటారు అని రాఘవ ఆన్సర్ చెప్పాడు.

"అదేంటి అలా పిలుస్తారా" అని రివర్స్ లో మళ్ళీ అడిగేసరికి "సొట్టలు పడిన ముఖాలకు అక్కడే కదా మాట్లు వేస్తారు" అని ఆన్సర్ ఇచ్చాడు రాఘవ. ఇంతలో రాఘవ దగ్గి "పొలమారడం అంటే ఏమనుకుంటున్నారు" అని అడిగాడు. దానికి ఇంద్రజ ఆన్సర్ ఇచ్చింది. "ఎవరైనా మన గురించి ఆలోచిస్తే మనకు పొలమారుతుంది" అని అంది. ఇంతలో పక్కింటావిడ వచ్చి "అయ్యో ఇప్పుడే మీ గురించి తలచుకున్నా అలా మీరే ప్రత్యక్షమయ్యారు. కొంచెం షుగర్, కాఫీ పొడి, పాలు ఇప్పించండి" అని గారంగా అడిగేసరికి "చెప్పాను కదా నాకు ఎందుకు పొలమారిందో. ఇదిగోండి అవన్నీ ఎందుకు డైరెక్ట్ గా కాఫీ తీసుకెళ్లండి" అని అన్నాడు రాఘవ. ఇక నూకరాజు స్కిట్ లో పెళ్ళాం చచ్చిపోయిన మొగుడు రోల్ లో నూకరాజు తెల్ల బట్టలు వేసుకుని కనిపిస్తూ ఉంటాడు. ఇంతలో పెళ్లి చూపుల కోసం పంచ్ ప్రసాద్ ఒక ఇంటికి వెళ్తాడు "ఇంతకు ఎం కట్నం ఇస్తారేంటి" అని అడిగేసరికి నూకరాజు " మగపడుచు కట్నం కింద రెండు అండర్ వేర్లు, రెండు బనీన్లు, రెండు బీడీ కట్టలు, మూడు అగ్గిపెట్టెలు ఇస్తాం" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇలా నెక్స్ట్ వీక్ జబర్దస్త్ లో వెరైటీ స్కిట్స్ తో ఆడియన్స్ ని కమెడియన్స్ అలరించబోతున్నారు.