English | Telugu

హరి గుండెలపై... అమ్మ చేతిపై.. అషూ ఏది రియల్?

'కామెడీ స్టార్స్' షోలో కమెడియన్ హరి తన గుండెలపై అషు పేరు పచ్చబొట్టు వేయించుకున్న సంగతి తెలిసిందే. అది టెంపరరీ టాటూ కాదని, ఒరిజినల్ అని తెలియడంతో అషురెడ్డి అతడి చెంపపై చాచి ఒక్కటి ఇచ్చింది. అయితే, ఇదంతా స్కిట్ లో భాగమని... స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని కొందరి అనుమానం.

అషురెడ్డి మదర్ కూడా టాటా వేయించుకున్నారు. కుమార్తె పేరును చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు. టాటూను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అషురెడ్డి. వరల్డ్‌లో బెస్ట్ మదర్ మా అమ్మే అని చెప్పుకొచ్చింది. "నిజంగా నా పేరును టాటూగా వేయించుకున్న ఏకైక వ్యక్తి. నా నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమించే ఏకైక వ్యక్తి... అమ్మ" అని అషురెడ్డి పోస్ట్ చేశారు. దాంతో హరి గుండెలపై టాటూ ఫేక్ అని అనుమానపడిన వాళ్లకు సమాధానం దొరికినట్టు అయింది.

హరి గుండెలపై... అమ్మ చేతిపై... రెండు టాటూలను పోస్ట్ చేసి 'ఏది రియల్?' అని అషురెడ్డిని ఒకరు ప్రశ్నించారు. 'రెండూ రియల్' అని ఆమె చెప్పింది. రెండూ రియల్ అయితే అమ్మ చేతిపై టాటూ పోస్ట్ చేసినప్పుడు తన పేరును టాటూ వేయించుకున్న ఏకైక వ్యక్తి అని చెప్పడం వెనుక అర్థం ఏమిటో? అషురెడ్డికి తెలియాలి. పైగా హ‌రి త‌న గుండెల‌పై వేయించిన టాట్టూను చూపించిన త‌ర్వాతే, అమ్మ చేతిపై త‌న టాట్టూను అషు షేర్ చేయ‌డం కూడా లెక్క‌లోకి తీసుకోవాలి.ఇంత‌కీ అషు పేరును ఆమె త‌ల్లి ఎప్పుడు ప‌చ్చ‌బొట్టుగా వేయించుకున్నారు?

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.