English | Telugu

వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన సుమ!

యూట్యూబ్‌లో హిట్టయిన వెబ్ సిరీస్‌ '30 వెబ్స్ 21' చూశారా? అందులో తొలి ఎపిసోడ్‌లోనే హీరో హీరోయిన్లు చైతన్య, అనన్యకు పెళ్లైనట్టు చూపిస్తారు. ఫస్ట్ నైట్ సీన్ కూడా ఉంటుంది. కానీ, పెళ్లి సీన్ ఉండదు. హాస్పటల్‌లో అమ్మాయిని అబ్బాయి చూడటం... కట్ చేస్తే ఇద్దరికీ పెళ్లైనట్టు చెప్పి డైరెక్టుగా ఫస్ట్ నైట్ సీన్‌లోకి వెళతారు. ఆ పెళ్లి తంతు జరిగితే ఎలా ఉంటుందో... 'స్టార్ మా' ఛానల్ షో 'స్టార్ట్‌ మ్యూజిక్‌లో సుమ చూపించారు.

హాస్పటల్‌లో అబ్బాయి, అమ్మాయి చూపులకు భిన్నంగా 'స్టార్ట్ మ్యూజిక్' షోలో సుమ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడమే కాదు... ఇద్దరికీ పెళ్లి చేసింది. 'మొత్తానికి మీ సిరీస్ లో జరగని పెళ్లి మా సిరీస్ లో జరిగింది' అని సుమ అంటే... 'సిరీస్ లో చాలా జరగలేదు' అని చైతన్య అన్నాడు. అందుకు అనన్య నవ్వింది. కమింగ్ సండే మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

చైతన్య, అనన్యతో పాటు 'రామ్ లీల', 'మేడమ్ సార్ మేడమ్ అంతే' హీరో హీరోయిన్లు శ్రీహాన్, సిరి హనుమంతు... 'సూర్య' హీరో హీరోయిన్లు షణ్ముఖ్ జస్వంత్, మౌనిక ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.