English | Telugu

79 ఏళ్ల వ‌య‌సులో సుమ తల్లి ఏం చేస్తోందో చూశారా..?

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై, సినిమా ఈవెంట్స్ తో సుమ చాలా బిజీగా ఉంటుంది. స్టార్ హీరోలపై కూడా సుమ సెటైర్లు వేస్తుంటుంది. కానీ ఇప్పటివరకు నెగెటివిటీ అనేది ఎప్పుడూ రాలేదు. అలాంటి సుమను ఈ మధ్య నెటిజన్లు ట్రోల్ చేశారు. తనపై వచ్చిన ట్రోలింగ్ పై స్పందిస్తూ సుమ ఘాటు కౌంటర్ ఇచ్చింది. గత వారంలో సుమ ఓ లేగ దూడకు సంబంధించిన వీడియో షేర్ చేయగా.. అందులో ఆ దూడ మూతికి వెదురు బుట్టి కట్టి ఉండడంతో అందరూ సుమను తిట్టారు. ఆవుపాలు దూడకు ఇవ్వకుండా ఇలా ప్రవర్తించడం ఏంటంటూ సుమని ప్రశ్నించారు. దీనిపై సుమ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ మేటర్ కి ఫుల్ స్టాప్ పడింది.

తాజాగా సుమ మరో వీడియో షేర్ చేసింది. ఇందులో తన తల్లి గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. తన తల్లికి 79 ఏళ్లు వచ్చినా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని.. రోజూ ఆమె చేసే వ్యాయామం, అలవాట్ల గురించి వివరించారు. రోజూ ఎలా ఉన్నా కూడా కచ్చితంగా వాకింగ్, సైకిల్ తొక్కడం, వ్యాయామం అన్నీ చేస్తానని సుమ తల్లి చెప్పుకొచ్చింది.

మనసు, మైండ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని.. దానికి ఉదాహరణ తన తల్లేనని చెప్పిన సుమ.. 79 ఏళ్లు వచ్చినా కూడా తన తల్లి ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారని చెప్పుకొచ్చింది. ప్రతీరోజూ వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటారని.. ఏం జరిగినా కూడా అవి మాత్రం మానదని.. ఆమె నిక్ నేమ్ బేబీ అని చెప్పిన సుమ.. తను షేర్ చేసిన వీడియోలను అమ్మలందరికీ అంకితమని చెప్పుకొచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.