English | Telugu

బావా మా కోసం పాట పాడవా.. అటు అషూరెడ్డి ఇటు స్రవంతి

ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి సింగర్స్ వచ్చారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని ఇన్వైట్ చేశారు. ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ ని ఈ షోలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ఈ మధ్య ఏ మూవీలో చూసిన థమన్ మ్యూజిక్ ఆడియన్స్ ని షేక్ చేసేస్తోంది. ఇక ఇప్పుడు ఫామిలీ స్టార్స్ కి థమన్ రాబోతున్నాడు. స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చేలోపు కొంతమంది టాప్ సెలబ్రిటీస్ ఆయన గురించి ఎం అన్నారో వాటిని ప్లే చేశారు. "థమన్ హార్డ్ వర్కర్" అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. "ఆరోజు ఎంత కష్టపడ్డాడో ఈరోజు అంతే కష్టపడుతున్నాడు" అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. "ఆడియో ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ థమన్" అంటూ బోయపాటి శీను చెప్పుకొచ్చారు. "ఎప్పుడు కలిసిన చిన్నపిల్లాడిలా ఎక్సయిట్ అవుతూ ఉంటాడు.

ఆ ఎక్సయిట్మెంట్ వల్లనే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు" అంటూ మహేష్ బాబు చెప్పారు. ఇక అష్షు రెడ్డి వచ్చి "థమన్ బావా" అనేసరికి థమన్ ఒక్కసారిగా ఎవరిని అంటుందో అని కంగారుపడి వెనుకాముందు చూసుకున్నాడు. తర్వాత మరో వైపు నుంచి స్రవంతి వచ్చి మా అందరి కోసం ఏదైనా ఒక చిన్న లైన్ పాడొచ్చు కదా అని అడిగింది. ఓజి నుంచి త్రిగణన దూత అంటూ ఒక లైన్ హం చేసాడు. "బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లా బిఫోర్ ఓజి ఆఫ్టర్ ఓజి నాకు" అన్నాడు థమన్. ఇక ఓజి, రాజాసాబ్, అఖండ మూవీ పోస్టర్స్ వేశారు. "బోయపాటి, బాలయ్య గారి కంబినేషన్ ఊచకోత" అని చెప్పాడు. తర్వాత పవిత్ర ఒక సౌండ్ సిస్టం అట్టపెట్టెని తన బాడీకి పెట్టుకుని వచ్చింది. "రేయ్ ఇప్పటి వరకు పేలినవన్నీ పాత సౌండ్ బాక్స్ లు పేలాయి. కొత్త సౌండ్ బాక్స్ లు పేలవు" అని చెప్పాడు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.