English | Telugu

అవి లేకపోతే రవి బతకలేడు!.. బ‌య‌ట‌పెట్టిన లాస్య‌!!

బుల్లితెరపై యాంకర్ రవి, లాస్య అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. 'సంథింగ్ స్పెషల్' అంటూ ఈ జంట యాంకర్లుగా చేసిన ఈ షో మంచి టీఆర్పీల‌ను రాబట్టింది. అప్పట్లో రవి, లాస్య జంటను ప్రేక్షకులు బాగా ఆదరించారు. కానీ కొన్నాళ్లకే ఇద్దరి మధ్య గొడవలు రావడం, విడిపోవడం.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం వంటివి జరగడంతో ఆన్ స్క్రీన్ మీద ఈ జంట కనిపించకుండాపోయింది. అలా దాదాపు ఐదేళ్లు గడిచాయి. ఇప్పుడు మళ్లీ రవి, లాస్య జంటగా కనిపించడం మొదలుపెట్టారు.

సంక్రాంతి ఈవెంట్ నుండి ఇద్దరూ బుల్లితెరపై రచ్చ చేయడం ప్రారంభించారు. ఈవెంట్లతో పాటు కామెడీ స్టార్స్ అనే షోలో హల్చల్ చేస్తున్నారు. మునుపటికంటే మరింత జోరుతో ముందుకు వెళ్తున్నారు. రొమాంటిక్ అండ్ కామెడీ స్పూఫ్ లతో రచ్చ చేస్తున్నారు. ఈ ఇద్దరికీ ఉన్న డిమాండ్ ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. పలు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తాజాగా ఆర్జే కాజల్ ఈ జంటను ఇంటర్వ్యూ చేసింది. అందులో కొన్ని ప్రశ్నలకు లాస్య చెప్పిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "ఏ మూడు వస్తువులు లేకపోతే రవి బతకలేడు?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు లాస్య వెరైటీగా బదులిచ్చింది. సోషల్ మీడియా, ఫోన్, శానిటైజర్ లేకపోతే రవి బతకలేడని.. మరీ ముఖ్యంగా శానిటైజర్ అయితే ఎప్పుడూ కారులోనే ఉంటుందని చెప్పింది. కరోనా రాకముందు కూడా రవి శానిటైజర్ వాడేవాడని.. ఏదైనా ముట్టుకుంటే వెంటనే శానిటైజర్ రాసుకుంటాడని చెప్పుకొచ్చింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.