English | Telugu

బన్నీతో ప్రేమలో పడిపోయా!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతోంది. ఇటు టీవీ షోలు, అటు సినిమాలతో బిజీ అయిపొయింది. మరోపక్క సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ లు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్‌ 'పుష్ప' సినిమాలో నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన అనసూయ.. బన్నీ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. తను 'పుష్ప' షూటింగ్ లో నాలుగు రోజులే పాల్గొందట. ఆ తరువాత కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఆ నాలుగు రోజుల్లోనే అల్లు అర్జున్ డెడికేషన్ చూసి ఫిదా అయ్యానంటూ బన్నీ అభిమానులను ఎట్రాక్ట్ చేసే కామెంట్స్ చేసింది.

కేవలం నాలుగు రోజుల్లోనే అల్లు అర్జున్ తో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చిన అనసూయ.. బన్నీ మల్టీటాలెంటెడ్ అంటూ తెగ పొగిడేసింది. ఆయనకు మంచి పేరు, క్రేజ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ తన మొదటి సినిమా కోసం ఎంత కష్టపడ్డారో 'పుష్ప' సినిమా కోసం కూడా అంతే కష్టపడుతున్నారని చెప్పింది. అల్లు అర్జున్ పాత్రతో ప్రేక్షకులు ఎగ్జైట్ అవ్వడం పక్కా అని చెప్పుకొచ్చింది అన‌సూయ‌.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.