English | Telugu

నాతో కుక్క చాకిరీ చేయించుకున్నారు!

సీనియర్ యాంకర్, న‌టి అనితా చౌదరి ఎన్నో సీరియల్స్ లో, సినిమాల్లో నటించారు. 'ఛత్రపతి', 'నువ్వే నువ్వే', 'మన్మథుడు' లాంటి సినిమాలు ఈమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. పేరు చివరన చౌదరి అని పెట్టుకున్న ఈ యాంకర్ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ తో పాటు టీవీ ఇండస్ట్రీలోనూ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందనే టాక్ ఎప్పటినుండో ఉంది.

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు చాలా వరకు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉండడంతో క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తుంటారనే ప్రచారం ఉంది. అయితే వీటిని ఖండిస్తూ కొంత కాలం క్రితం యాంకర్ అనితా చౌదరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండవని, చౌదరి అనేసరికి ఊడిగం చేయించుకునేవారని.. త‌న‌తో కుక్క చాకిరీ చేయించారని.. ఆఫీస్ బాయ్ కు ఎక్కువ, యాక్టర్ కి తక్కువ అన్నట్లుగా ఉండేది త‌న‌ పరిస్థితి అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తన పేరు గోగినేని అనిత అని.. కానీ ఈటీవీలో సీరియల్స్ చేసినప్పుడు స్క్రీన్ పై తన పేరుని అనితా చౌదరి అని వేశారని.. ఆ తరువాత అలా కంటిన్యూ అయిపోయిందని చెప్పారు. తన పేరు వెనుక చౌదరి తీసేయమని చెప్పినా.. ఎవరూ వినలేదని.. 'కమ్మ అమ్మాయిలు త్వరగా ఇండస్ట్రీకి రారు.. మీరు వచ్చారు కాబట్టి చౌదరి అని ఉంచుకోండి' అంటూ సలహాలు ఇచ్చారని.. ఈ విషయంలో తన మాట వినలేదని వెల్ల‌డించారు. ఇండస్ట్రీలో కమ్మ వాళ్లే కాకుండా.. అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారని.. తనతో పని చేసిన సుమ చౌదరి కాదని, ఝాన్సీ చౌదరి కాదని.. కానీ అందరం ఒకే ఫ్యామిలీలా ఉన్నామని అనిత తెలిపారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.