Read more!

English | Telugu

డాన్స్ షోలో రమ్యకృష్ణ!

 

కరోనా వైరస్ విజృంభ‌ణ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్ ను ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెర‌గ‌డంతో సినిమా, టీవీ షూటింగ్ లను నిలిపివేశారు. ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి రావడంతో రమ్యకృష్ణ షూటింగ్ లో పాల్గొంటున్నారు. విజ‌య్ టీవీలో ప్రసారమవుతోన్న 'బీబీ జోడిగళ్' డాన్స్ షోకి రమ్యకృష్ణ కో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. 

తాజాగా ఈ షోకి సంబంధించిన షూటింగ్ లో రమ్యకృష్ణ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు రమ్యకృష్ణ. "బీబీ జోడిగళ్ సెట్ కు మళ్లీ వచ్చేశాం.. సేఫ్టీ ప్రొటోకాల్స్‌తో షూటింగ్ కొనసాగుతోంది. మాస్క్ లు పెట్టుకొని.. సురక్షితంగా షూటింగ్ చేస్తున్నాం" అంటూ రాసుకొచ్చారు రమ్యకృష్ణ. ఆ త‌ర్వాత ఆ షో లేటెస్ట్ ప్రోమో వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు జాగ్రత్తగా ఉండమంటూ సలహాలు ఇస్తున్నారు. 

ఈ షోలో వనితా విజయ్ కుమార్ ఓ కంటెస్టెంట్. ఆమె కూడా రమ్యకృష్ణతో పాటు షూటింగ్ లో పాల్గొంది. ఈ షోలో సురేష్ చక్రవర్తితో కలిసి వనితా విజయ్ కుమార్, సోమశేఖర్‌తో శివానీ నారాయణ్, అజిద్ ఖాలీక్యుతో గ్యాబ్రియెల్లా చార్లటన్, షరీఖ్ హసన్‌తో అనితా సంపత్, సంయుక్త కార్తీక్‌తో జితన్ రమేష్  తదితరులు పాల్గొంటున్నారు.