English | Telugu

యాంకర్ రవి కొత్త షోలో ప్ర‌త్య‌క్ష‌మైన టిక్ టాక్ భార్గవ్!

యూట్యూబ్, టిక్ టాక్ లతో భార్గవ్ బాగా పాపులర్ అయ్యాడు. అతడి ఫన్నీ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చేవి. ఆ విధంగా కాస్త క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు అతడిని బాగా ట్రోల్ చేశారు. అందరూ అతడిని విలన్ లా చూడడం మొదలుపెట్టారు. అతడికి జైలు శిక్ష పడడంతో ఇప్పుడు జైలు జీవితాన్ని గడుపుతున్నాడు.

అలాంటి వ్యక్తి ఇప్పుడు సడెన్ గా ఓ టీవీ షోలో కనిపించాడు. అయితే అతడు అరెస్ట్ కావడానికి ముందు ఈ షోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. యాంకర్ రవి, అషురెడ్డి హోస్ట్ లుగా 'హ్యాపీ డేస్' అనే షోను మొదలుపెట్టారు. రెండు నెలల క్రితమే ఈ షోను టెలికాస్ట్ చేయాలనుకున్నారు. కానీ ఆలస్యం జరిగి ఈ సోమవారం నుండి టెలికాస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

రెండో ఎపిసోడ్ లో జ‌బ‌ర్‌ద‌స్త్ వ‌ర్ష‌తో క‌లిసి భార్గవ్ కనిపించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. అయితే భార్గవ్ ఈ షోలో ఉన్నాడు కాబట్టి నెటిజన్లు ట్రోల్ చేసే ఛాన్స్ ఉందని గ్రహించిన నిర్వాహకులు.. కామెంట్ సెక్షన్లను ఆఫ్ చేశారు. జనాల్లో భార్గవ్ పై ఉన్న నెగెటివిటీ కారణంగా తమ షో మీద విరుచుకుపడే ఛాన్స్ ఉందని కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క ఎపిసోడ్ లో మాత్రం భార్గవ్ ఉన్నాడని సమాచారం.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.