English | Telugu

యాంకర్ రవిపై 'ఫన్ బకెట్' జస్విక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!.. ర‌వి రియాక్ష‌న్‌!!

సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలైన వారు చాలా మంది ఉన్నారు. అలా యూట్యూబ్ , టిక్ టాక్ ద్వారా పాపుల‌ర్ అయిన జస్విక తెలుగువ‌న్ యూట్యూబ్ చాన‌ల్‌లోని 'ఫన్ బకెట్ జూనియ‌ర్' సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాక్ట‌ర్‌, సింగర్, డాన్సర్ ఇలా అన్నింట్లోనూ తన టాలెంట్ ను నిరూపించుకున్న జస్విక.. 'ఫన్ బకెట్ జస్విక'గా నెట్టింట్లో పాపుల‌ర్ అయ్యింది. ఆ మధ్య 'డాన్స్ ప్లస్' షోలోనూ ఓ స్పెషల్ ఎపిసోడ్ లో కనిపించింది. ఆమె వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు.

ఇదిలా ఉండగా.. జస్విక తాజాగా ఇన్స్టాగ్రామ్ లో తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది. నెటిజన్లు వేసిన రకరకాల ప్రశ్నలకు జస్విక సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో యాంకర్ రవిపై మీ అభిప్రాయం ఏంట‌ని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. ఈ సంద‌ర్భంగా ర‌వి గురించి జస్విక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నారు. రవి అందరికంటే యూనిక్ గా ఉంటారని.. ఆయనతో కలిసి షో చేసినప్పుడు.. ఆయన్ను అలాగే చూస్తూ ఉండిపోయానని.. ఆయన ప్రతి ఒక్కరినీ పలకరించే విధానం తనకు ఎంతో నచ్చుతుందని చెప్పింది జ‌స్విక‌.

సెట్ లో ప్రతి ఒక్క విషయాన్ని ఆయన ఎంతో బాగా హ్యాండిల్ చేస్తూ.. సరదా వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంటారని, ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉందని.. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. ర‌వితో క‌లిసి ప‌నిచేసినందుకు ఎంతో ఆనంద‌ప‌డుతున్నాన‌ని చెప్పింది. తన గురించి జస్విక చేసిన వ్యాఖ్యలకు రవి ఎమోషనల్ అయ్యాడు. ''నా గురించి ఇంత రాశావ్.. థాంక్యూ.. నువ్వు ఎంతో స్వీట్.. మళ్లీ మనం సెట్ మీద కలిసి పని చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నా.'' అని రవి బదులిచ్చాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.