English | Telugu

భార్యను గోడకేసి కొట్టిన నటుడి అరెస్ట్‌!

ప్రముఖ హిందీ టెలివిజన్ నటుడు కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత రాత్రి భార్య నిషా రావల్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కరణ్ ను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అయితే వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చాడు కరణ్. 'యే రిష్తా క్యా కెహ్లతా హై' అనే సీరియల్‌తో పాపులర్ అయిన కరణ్ ఆ తరువాత పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. చాలా కాలం పాటు నిషాతో డేటింగ్ చేసిన కరణ్ 2012లో ఆమెను పెళ్లాడాడు.

ఈ జంటకు కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కరణ్-నిషా జంటగా 'నాచ్ బలియే' సీజన్ 5లో పాల్గొన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాము బాగానే ఉన్నామని.. ఈ వార్తల్లో నిజం లేదని స్పందించారు. రీసెంట్‌గా కరణ్‌కి కరోనా సోకినప్పుడు.. తన భార్య నిషా ఎంతో ధైర్యం చెప్పిందని.. తనను చాలా జాగ్రత్తగా చూసుకుందని చెప్పాడు.

అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా నిషా తన భర్తపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కొన్ని వారాలుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఇప్పుడు అవి తారా స్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. ఆ సమయంలో కరణ్ ఆవేశంతో నిషా తలను గోడకేసి కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో నిషా పోలీసులను ఆశ్రయించింది. కరణ్‌పై సెక్షన్ 336, 337 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబైలో త‌న‌ నివాసంలో ఉన్న కరణ్‌ను అరెస్ట్ చేశారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.