English | Telugu

అయ్యో బిగ్ బాస్ బ్యూటీకి ఎంత కష్టమొచ్చిందో...కాలుకు కట్టుతో


బిగ్ బాస్ షోతో పాపులర్ ఐన దివి గురించి అందరికీ తెలుసు. ఈమె బిగ్ బాస్ బ్యూటీ మాత్రమే కాదు ఎన్నో మూవీస్ లో కూడా నటించింది. రుద్రాంగి, రీసెంట్ గా వచ్చిన హరికథ, సింబా లాంటి ఎన్నో మంచి మూవీస్ లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ లో అలాగే హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పొచ్చు. అలాంటి దివి తన ఇన్స్టాగ్రామ్ లో లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్స్ చూసి అందరూ షాకవుతున్నారు. తన కాలుకు కట్టుకుని కనిపించింది. అలాగే ఒక పోస్ట్ కూడా పెట్టింది.


"కొన్నిసార్లు జీవితం మన మీదకు రకరకాల సమస్యలను బంతుల్లా విసురుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ సమస్యకు మనం కుంగిపోయి కాలు విరగ్గొట్టుకుంటే మాత్రం దానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కట్టు కూడా కడుతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఐనా లైఫ్ లో అలాంటి ఎంటర్టైన్మెంట్ ని ఎందుకు ఆపాలి మనం ? అందుకే వాటిని అస్సలు పట్టించుకోకుండా ఆ సమస్యలకు కట్టు కట్టిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నే నా కాన్వాస్ గా మార్చుకున్నా.. మంచిగా బొమ్మలు గీస్తున్నా. ఈ చిన్న ఆక్సిడెంట్ ని కొంత క్రియేటివ్ గా కొంచెం మెమొరబుల్ గా మార్చుకుంటున్న. జీవితం అంటే సవాళ్లను తప్పించుకోవడం కాదు. గందరగోళంలో కూడా నవ్వడం అనేది నేర్చుకోవాలి. కష్ట సమయాల్లో జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడంలో ప్రత్యేకత ఉంటుంది. వెళ్లే దారిలో ఎన్నో సమస్యలు వస్తాయి... చూసుకుని వెళ్ళాలి అంటూ నేర్పించే పాఠాలు ఎన్నో మనకు తెలుస్తూ ఉంటాయి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ! ప్రతిదానిలో ఆనందాన్ని వెతుక్కుందాం. చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిద్దాం. ఈ సీజన్‌ను ఎప్పటిలాగే ఉత్సాహంగా మరియు మరపురానిదిగా చేద్దాం.." అంటూ ఒక భారీ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. క్రిస్మస్ రోజున తన లెగ్ ఇంజ్యూరి అయ్యిందని చెప్పుకొచ్చింది. కాలికి వేసిన సిమెంట్ కట్టు మీద రకరకాల పిచ్చి రాతలు, పెయింటిగ్ వేస్తూ ఎంజాయ్ చేసింది. ఇక దివి పిక్స్ చూసాక నెటిజన్స్ "గెట్ వెల్ సూన్ , అసలు ఏమయ్యింది, స్పీడీ రికవరీ" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.