English | Telugu

మూడు సిద్ధిపేట కుటుంబాల‌కు సాయం చేసిన‌ అభిజిత్!

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ కారణంగా వందల మంది మరణిస్తున్నారు. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు మరోసారి నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ముందుకు వస్తున్నారు.

తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కూడా తన ఉదారతను చాటుకున్నాడు. సిద్ధిపేటకు చెందిన మూడు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారి అవసరాన్ని తీర్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిజిత్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

''మూడు కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారని నిన్న సాయంత్రం సిద్ధిపేట నుండి ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. వెంటనే నేను నాకు తెలిసిన యువకులను దీని గురించి తెలుసుకోమని చెప్పాను. తెల్లారిలేచే సరికి ఈ ఫోటోలు, వీడియోలు నాకు పంపించారు. ఇందులో సహకరించిన సిద్ధిపేట‌ యువకులకు ధన్యవాదాలు'' అంటూ అభిజిత్ రాసుకొచ్చాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.