English | Telugu
Karthika Deepam2: దీపకు జీవితఖైదు.. ఆ భగవాన్ దాస్ ఎవరు?
Updated : Apr 17, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-333లో.. జ్యోత్స్నకి పారిజాతం సలహా ఇస్తుంటే.. ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర, శివన్నారాయణ, పారిజాతం హాస్పిటల్ లో దశరథ్ రూమ్ బయట వెయిట్ చేస్తుంటారు. అప్పుడే కాంచన శివన్నారాయణకి ఫోన్ కాల్ చేస్తుంది. కానీ అతను లిఫ్ట్ చేయకపోవడంతో సుమిత్రని కాల్ లిఫ్ట్ చేయమంటుంది పారిజాతం.
ఇక సుమిత్ర కాల్ లిఫ్ట్ చేయగానే.. అన్నయ్యకు ఎలా ఉంది వదినా అని కాంచన ఏడుస్తూ మాట్లాడుతుంటే.. సుమిత్ర ఆవేశంగా తిట్టేస్తుంది. నీ కోడలు చేయాలి అనుకున్నది ఇంకా జరగలేదులే.. మాట ఇచ్చి మనుషుల్ని నమ్మి, మేము మోసపోవడమే కానీ.. మేము ఎవరినీ ఏనాడు అన్యాయం చేయలేదు.. మాకు కాల్ చేయొద్దు వదినా అని సుమిత్ర తిడుతుంది. పారు మనసులో నవ్వుకొని వెంటనే ఫోన్ తీసుకుని.. మా దశరథ్ పోతే ఆస్తి మొత్తం మీకొస్తుందని ఆశపడుతున్నారా అది ఇదని అవమానిస్తుంది. ఇక శివనారాయణ కోపంగా ఫోన్ లాక్కుని.. ఇక నీ ముఖం చూపించకు ఇదే నా ఆఖరి కోరిక అని తిట్టి పెట్టేస్తాడు.
ఇక అలా తిట్టగానే కాంచన ఏడుస్తుంటుంది. అది చూసి అనసూయ ఓదారుస్తుంది. దీప పరిస్థితి అలా అయినందుకు అనసూయ కూడా ఏడుస్తుంది. రేయ్ కుబేరా.. నీ బిడ్డను నువ్వే కాపాడుకోరా.. ఏదో రూపంలో సాయం చెయ్యరా అని అనసూయ బాధపడుతుంది. కాసేపటికి కావేరీ అక్కడికి వస్తుంది. కాంచన, అనసూయలతో కావేరి ఓదార్పుగా మాట్లాడుతుంటే.. వెనుకే శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ వెటకారంగా మాట్లాడుతుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. అప్పుడే శ్రీధర్ షాకింగ్ విషయం చెబుతాడు. వాళ్లకు ఫ్యామిలీ లాయర్ భగవాన్ దాసు ఉన్నారు.. ఆయన దీపకు వ్యతిరేఖంగా కేసు వాదించడం మొదలుపెడితే దీప జీవితఖైదే అని శ్రీధర్ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.