English | Telugu

ఆదిరెడ్డి గెలవాలని గీతు ఆరాటం.. నెరవేరుతుందా మరి!

బిగ్ బాస్ హౌస్ లో గలాటా గీతు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఎన్ని వారాలు ఉందో.. అన్ని వారాలు కూడా బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు మైండ్ గేమ్ అంటే ఏంటి? ఏ కంటెస్టెంట్  ఎలా ఆడుతాడు? ఎలా ఉంటాడు? అనే ఒక ఆసక్తిని కలుగజేసిన ఏకైక కంటెస్టెంట్ గలాటా గీతు.

అయితే గీతు హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా ఆదిరెడ్డితో కలిసి ఉండేది. పక్కనే ఉండి కబుర్లు చెబుతూ, సలహాలు, రివ్యూలు చెప్పేది. ఆదిరెడ్డి కూడా 'గీతక్క.. గీతక్క' అంటూ తిరిగేవాడు. గీతు బయటకొచ్చాక బాగా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాడనే విషయం అందరికి తెలిసిందే. 

అయితే గీతు బయటకొచ్చినా కూడా ఆదిరెడ్డి గెలవాలని కోరుకుంటుంది. "ఆది గెలిస్తే కోయంబత్తూర్ లోని ఆదియోగి స్టాట్యూ దగ్గరకి వస్తాను దేవుడా" అంటూ వేడుకుంటోంది గీతు. కాగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ నెట్‍వర్కింగ్ సైట్లలో వైరల్ గా  మారి ట్రెండింగ్ లో ఉంది. అయితే రివ్యూ రైటర్ గా ఉన్న ఆదిరెడ్డి హౌస్ లోకి వెళ్ళాక కూడా గేమ్ లు ఆడకుండా, టాస్క్ లో పర్ఫామెన్స్ ఇవ్వకుండా ఎలా సేవ్ అవుతాడని వీక్షకులు భావిస్తున్నారు. అయితే ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న ఆదిరెడ్డి సేవ్ అవుతాడో లేదో? గీతు ఆశ నెరవేరుతుందో లేదో? చూడాలి మరి!