English | Telugu
రెచ్చిపోయిన రేవంత్.. తగ్గని ఆదిరెడ్డి!
Updated : Nov 29, 2022
బిగ్ బాస్ లో సోమవారం నామినేషన్ ప్రక్రియ అనేది మాటల యుద్ధాన్ని తలపించేలా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు వారి అభిప్రాయాలు చెప్తూ ఉంటే, అవతల ఉన్న హౌస్ మేట్స్ దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో మాటా మాటా పెరిగి హౌస్ లో యుద్ధ వాతావరణం నెలకొంది.
అయితే మొదట ఆదిరెడ్డి నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టగా.. తన మొదటి నామినేషన్ గా రేవంత్ ని చేసాడు. ఆ తర్వాత ఇద్దరు రెచ్చిపోయారు. మాటలతో పోట్లాడుకున్నట్టుగా సాగింది వారి మధ్య సాగిన మాటల యుద్ధం. అయితే ఆదిరెడ్డి గత వారంలో జరిగిన టాస్క్ కి సంబంధించి 'అమ్మాయిలతో ఆడితే ఈజీగా ఉంటుంది' అంటూ జరిగిన ఆర్గుమెంట్ కు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని నాగార్జున చూపించాడు. అందులో ఆదిరెడ్డి మిస్టేక్ గా మాట్లాడినట్టు తెలిసింది. "రేవంత్ 'అయిపాయె' అని అన్నాడు. అలా అనడం నాకు నచ్చలేదు" అంటూ ఆదిరెడ్డి చెప్పాడు. నువు పోటుగాడివా అంటూ ఒకరికొకరు అనుకున్నారు. "శ్రీసత్య, శ్రీహాన్ లలో.. శ్రీహాన్ ఉండటమే కరెక్ట్ అని నేను అన్నాను. నువ్వు నామినేషన్ చేసి వెళ్ళిపో" అని రేవంత్ అన్నాడు, "నేను చెప్పాలనుకున్నది చెబుతా.. వింటే విను లేదంటే వెళ్ళి సోఫాలో కూర్చో" అని ఆదిరెడ్డి అన్నాడు.
"నువ్వు గేమ్ గురించి సలహాలు ఇస్తావ్ కదా. నువ్వు ఒక పెద్ద మానిపులేటివ్" అని రేవంత్ చెప్పడంతో, "నేను మానిపులేటివ్ అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పు. నీ స్టేటమెంట్ మీద నువ్వు స్టాండ్ తీసుకోవు. నువ్వు నిజాన్ని ఒప్పుకోవు. ఆ ధైర్యం నీకు లేదు. నేను ఒప్పుకుంటా నాకు ధైర్యం ఉంది రేవంత్" అని ఆదిరెడ్డి అన్నాడు. అయితే ఆదిరెడ్డి, రేవంత్ ఇద్దరు కూడా గతవారం జరిగిన అంశాన్ని, నాగార్జున క్లారిటీ ఇచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈ విషయం గురించి వీకెండ్ లో వచ్చే నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.