English | Telugu
గులాబీ ఇచ్చి లవ్ ప్రపోజ్ చేసిన కుర్రాడు...దిమ్మ తిరిగే షాకిచ్చిన సుమ
Updated : Nov 29, 2022
బుల్లితెర మీద గ్యాప్ లేకుండా కామెడీ చేసే షో క్యాష్. ప్రతీ వారం కొత్త కొత్త సెలబ్రిటీలతో ఈ షో సందడి చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు రాబోయే ఎపిసోడ్ కి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈసారి షోలో ప్రభాస్ శ్రీను, హేమ, ప్రవీణ్, హరితేజ పాల్గొన్నారు. ప్రోమో మొత్తం కూడా మంచి జోష్ తో కనిపించి, ఫుల్ కామెడీని పంచింది. ప్రభాస్ శీను కొన్ని సీన్స్ డైరెక్ట్ చేయడం..దానికి తగ్గట్టు హరితేజ జోక్స్ వేయడం మంచి ఎంటర్టైనింగ్ గా అనిపించింది.
ఇక తర్వాత వాళ్ళతో మ్యూజికల్ చైర్స్ కూడా ఆడించింది సుమ. ఆ తర్వాత "క్యాష్ ఫిలిం స్కూల్" అని పెట్టి అందరికి రకరకాల టాస్కులు ఇచ్చింది. ఇందులో భాగంగానే కమెడియన్ ప్రవీణ్ డైరెక్షన్ చేస్తూ.. పార్క్ లో ఉండే ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయాలని చెప్తుంది సుమ. ఆడియెన్స్ లోంచి ఒక అబ్బాయిని పిలిచి.. ఆ అబ్బాయికి ఓ గులాబీ ఇచ్చాడు ప్రవీణ్. కట్ చేస్తే.. ఆ అమ్మాయి స్థానంలో యాంకర్ సుమ నిలబడి కనిపిస్తుంది. ఆ కుర్రాడు వెళ్లి.."నేను మిమ్మల్ని బాగా ఫాలో అవుతాను, ఐ లవ్ యూ".. అని ప్రపోజ్ చేసేసరికి "నువ్వు మా అబ్బాయి క్లాస్ మేట్ కదా" అని సెటైర్ వేసింది. ఇంకేముంది స్టేజి మొత్తం నవ్వులే నవ్వులు.