English | Telugu

హరి నువ్వు రాసుకుంటేనే నీకు పంచులు వస్తాయి

కూకు విత్ జాతిరత్నాలు షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే అది ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఈ షోకి హరి, ఇమ్మానుయేల్, బాబా భాస్కర్, సుహాసిని, రీతూ వచ్చారు. హరి మెడలో ఉన్న విజిల్ చూసిన ప్రదీప్ "ఏంటి నువ్వు మెడలో విజిల్ వేసుకొచ్చావ్" అని అడిగాడు. దానికి ఇమ్ము ఆన్సర్ ఇచ్చాడు. "పొద్దున్నే మనోడు ఇదే పనికి వెళ్తూ ఉంటాడు. విజిల్ వేయగానే తడి చెత్త, పొడి చెత్త తీసుకొస్తారు" అని కౌంటర్ వేసాడు ఇమ్ము. ఇక ఈ షోకి తమ్ముడు మూవీ నుంచి ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ లయ కూడా ఈ షోకి వచ్చింది. అలాగే దిల్ రాజు కూడా వచ్చారు. "దిల్ రాజు గారు మీరు ఏ ఫుడ్ ఇష్టం" అంటూ రాధ అడిగారు. "ఫేవరేట్ ఫుడ్ అంటే నాకు డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం" అని చెప్పారు.

దానికి ఇమ్ము రియాక్ట్ అయ్యాడు. "రాజు గారికి స్వీట్ ఇష్టం కాబట్టి కాకరకాయతో కూర కాకుండా స్వీట్ చేస్తాం" అని చెప్పాడు. దాంతో దిల్ రాజు షాకై కాకరకాయతో స్వీట్ ఏంట్రా అంటూ కౌంటర్ వేశారు. తర్వాత మళ్ళీ "చిన్నప్పుడు ఆయా నా మీద అరుస్తూ ఉంటే ఆయా ఆయా అని పిలిచేవాడిని కాదు లయా లయా అని పిలిచేవాడిని" అని చెప్పేసరికి లయ, దిల్ రాజు నవ్వేశారు. ఇక హరి ఏదో డైలాగ్ చెప్పబోయాడు కానీ పాపం చెప్పలేకపోయాడు. దాంతో రాధ హరి పరువు తీసేసారు. "నీకు స్పాంటేనియస్ గా రావు పంచులు నువ్వు రాసుకుంటేనే వస్తాయి" అనేసరికి హరి షాక్ అయ్యాడు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.