English | Telugu

Brahmamudi : బిజినెస్ పనిమీద అమెరికాకి కావ్య, రాజ్.. ఆస్తులన్నీ దోచుకున్నారంటూ రుద్రాణి గొడవ!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -633 లో....కావ్య వేసిన డిజైన్స్ బాగున్నాయని రాజ్ మెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా చేస్తానో చూడమని ఒకతనికి కాల్ చేసి డిజైన్ పంపిస్తాడు. అక్కడ వేళంపాట జరుగుతుంది. ఈ డిజైన్ వాళ్ళకి చూపించి.. ఇది స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ నుండి వచ్చింది ఒకటే పీస్ అని అక్కడున్నా వాళ్ళకి చెప్తాడు. అందరు పోటీ పడి మరి ఈ డిజైన్ కి వేళం పాడతారు. అదంతా రాజ్ కావ్య ఫోన్ లో వింటూ ఉంటారు. ఆ డిజైన్ కోటిన్నరకి అమ్ముడుపోతుంది. చూసావా దాని కాస్ట్ ఇరవై అయిదు లక్షలు కానీ ఎంతకీ ప్రమోట్ చేసానో చూసావా.. ఇది బిసినెస్ అంటే.. ఇప్పుడు చెప్పు డిజైనర్ గొప్పనా బిజినెస్ మ్యాన్ గొప్పనా అని రాజ్ అనగానే.. మీరే గొప్ప అని ఒప్పుకుంటున్నానని కావ్య అంటుంది.

స్వప్నకి రెంట్ డబ్బులు రెండు లక్షలు వస్తాయి. ఆ విషయం రుద్రాణి, రాహుల్ లకి తెలిసి మాకు డబ్బు కావాలి ఇవ్వమని అడుగుతారు. ఇవ్వనని స్వప్న చెప్పడంతో దీని అకౌంట్ లోని డబ్బు నా అకౌంట్ లోకి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసని రుద్రాణితో రాహుల్ అంటాడు. రాహుల్ తెలివిగా స్వప్న ఫోన్ కి ఒక లింక్ పంపిస్తాడు. అది ఓపెన్ చెయ్యగానే మన అకౌంట్ లోకి డబ్బు వస్తుందని రాహుల్ అంటాడు. అనుకున్నట్లుగానే స్వప్న లింక్ క్లిక్ చెయ్యగానే తన డబ్బు మొత్తం రాహుల్ అకౌంట్ లోకి పడిపోతుంది. అది చూసుకొని అయ్యో డబ్బు ఎలా మా అయిందని స్వప్న కంగారుగా రాహుల్, రుద్రాణి దగ్గరికి వచ్చి నా అకౌంట్ లో డబ్బుపోయింది అంటుంది. అందుకే అన్ని లింక్స్ ఓపెన్ చెయ్యొద్దని రాహుల్ అంటాడు. నేను లింక్ ఓపెన్ చేసినట్లు తనకేల తెలుసు.. రాహుల్ ఈ పని చేసి డబ్బు లేకుండా చేసాడని స్వప్న అనుకుంటుంది. రాజ్ దగ్గరికి తన ఫ్రెండ్ వస్తాడు. మీరు వేసిన డిజైన్స్ వాళ్లకి బాగా నచ్చాయి. అందుకే అమెరికాలో మీటింగ్ ఏర్పాటు చేసాను. నువ్వు కావ్య వెళ్ళాల్సి ఉంటుందని అతను చెప్పగానే అమెరికానా అంటూ కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.

తనని మోసం చేసి డబ్బు తీసుకున్నారని స్వప్నకి అర్థమవుతుంది. రాహుల్ మళ్ళీ తన ఫ్రెండ్ దగ్గర డబ్బు అడిగానని రుద్రాణికి చెప్తాడు. రుద్రాణి దగ్గరికి రాహుల్ వచ్చి.. నాకు ఒక యాభై వేలు కావాలని అంటుంది. లేవు ఇందాక మేము అడిగితే ఇచ్చావా అని రుద్రాణి అంటుంది. దాంతో నన్నే మోసం చేస్తారా అంటూ తను కూడా ఒక లింక్ రాహుల్ కి పంపిస్తుంద. అది రాహుల్ క్లిక్ చెయ్యగానే తన డబ్బు మొత్తం స్వప్న అకౌంట్ లోకి వస్తుంది. ఎందుకు అలా చేసావ్ రా దాని డబ్బుతో పాటు మన డబ్బు కూడా పోయిందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. స్కామార్స్ ఉంటారు కదా చూసుకోవాలి కదా అంటూ స్వప్న అనగానే.. ఈ పని చేసింది స్వప్ననే అని వాళ్ళకి అర్ధమవుతుంది. తరువాయి భాగంలో రాజ్ వీసా గురించి ఫోన్ లో మాట్లాడడం విన్న రుద్రాణి... అందరి ముందుకి వచ్చి ఆస్తులు తాకట్టు పెట్టి మరి అమెరికాకి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.