English | Telugu

Avinash Elimination: అవినాష్ ఎలిమినేషన్.. ఈ వారం కూడా మన తెలుగోడే!

బిగ్ బాస్ సీజన్-8లో ప్రతివారం నామినేషన్స్ చేయడం.. జనాలతో ఓట్లు వేయించుకోవడం.. ఓట్లు వేసేదేమో తెలుగు వాళ్లు.. కానీ సేవ్ అయ్యేదేమో కన్నడ కంటెస్టెంట్స్. (Bigg Boss 8 Telugu)

తెలుగు వాళ్ల ఓట్లతో తెలుగు కంటెస్టెంట్స్‌ని బలి చేస్తున్నారు బిగ్ బాస్. గత పది వారాలుగా ఇదే జరుగుతుంది. ఇప్పటి వరకూ పన్నెండు మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్-8 నుంచి ఎలిమినేట్ అయితే.. వాళ్లంతా తెలుగు వాళ్లే. అయితే కనీసం పదకొండో వారంలోనైనా తెలుగు వాళ్లపై దయ చూపిస్తారేమోనని అనుకున్నారంతా కానీ అది నెరవేరలేదు. హౌస్ లో మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్ చేస్తోన్న అవినాష్ ని ఎలిమినేషన్ చేశారు. లీస్ట్ ఓటింగ్‌లో విష్ణు ప్రియ, పృథ్వీలు ఉన్నారు. అయితే వీళ్లిద్దరూ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమ జంట కావడంతో వీళ్లని హౌస్ నుంచి పంపిస్తే మాకు కంటెంట్ ఎవరిస్తారని బిగ్ బాస్ అనుకున్నారో ఏమో కానీ పృథ్వీని ముందే సేవ్ చేశారు. ఇక విష్ణు ప్రియను చివరి వరకు ఉంచి చివర్లో అవినాష్‌ని ఎలిమినేట్ చేశారనేది తెలుస్తోంది.

ఈవారం నిఖిల్ నామినేషన్స్‌లో లేకపోవడం కూడా విష్ణు ప్రియ, పృథ్వీ, యష్మీలకు కలిసి వచ్చింది. అతని ఓట్లు యష్మీ, విష్ణు ప్రియ, పృథ్వీలకు భారీగా షేర్ అయ్యాయి. శనివారం నాటి ఎపిసోడ్‌లో ఫస్ట్ సేవ్ అయ్యింది పృథ్వీ. సెకెండ్ సేవ్ అయ్యింది గౌతమ్. విష్ణుప్రియ ఇంకా నామినేషన్ లో ఉంది. సండే అంటే నేటి ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ అయ్యారనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.