వరద బాధితులకు అండగా అక్కినేని కుటుంబం!
భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలబడేందుకు ఎప్పటిలాగే తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ఎందరో సినీ స్టార్స్ విరాళాలను ప్రకటించారు. తాజాగా అక్కినేని కుటుంబం కూడా విరాళం ప్రకటించింది.