English | Telugu

గౌరి సిగ్నేచ‌ర్స్ స్టోర్ లో సంద‌డి చేసిన సెల‌బ్రిటీ క‌పుల్ శ్రీకాంత్ కిదాంబి, శ్రావ్య వ‌ర్మ‌!

వివాహం మ‌రింత ప్ర‌త్యేకంగా మారాల‌ని ఈ జ‌న‌రేష‌న్ ప‌రిత‌పిస్తుంది. వారి కోరిక‌ల‌కు, అభిరుచిల‌కు త‌గిన విధంగా వివాహా వ‌స్త్రాల‌ను మ‌రింత ప్ర‌త్యేకంగా డిజైన్ చేస్తూ వారి వివాహాంలో ముఖ్య‌ పాత్ర‌ను పోషిస్తుంది గౌరి సిగ్నేచర్స్. హైద్రాబాద్ లో గౌరీ సిగ్నేచ‌ర్స్  మరియు గౌరి సిగ్నేచర్స్ లో భాగమైన U&G పెళ్లి వస్త్రాలను డిజైన్ చేయటం లో తమ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాయి. త్వ‌రలో పెళ్ళి కానున్న బ్యాడ్మెంట‌న్ ప్లేయ‌ర్ శ్రీకాంత్ కిదాం బి, స్టైలిస్ట్ శ్రావ్యవ‌ర్మ సిగ్నేచ‌ర్ స్టూడియో లో త‌మ వెడ్డింగ్ డిజైన్స్ ను సెలెక్ట్ చేసుకున్నారు.