English | Telugu

శ్రీమతి మూవీ రివ్యూ

ఇద్దరు భార్యభార్తలు కలిసి ఓ హాస్పిటల్ లోని డాక్టర్ తో మాట్లాడుతుంటారు. ఆమెకి ప్రెగ్నెన్సీ రావడంతో డాక్టర్ టెస్ట్ చేసి చెప్తుంది. అయితే హర్మోన్స్ లోపం వల్ల వాటర్ బబుల్స్ వచ్చాయని ఓ ఆరు నెలలు కోర్స్ వాడితే పిల్లలు పుడతారని వారితో డాక్టర్ చెప్తుంది. ఇక ఆ భర్త కన్ఫమ్ గా పిల్లలు పుడతారా అని అడుగగా.. ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్తుంది. అసంతృప్తిగానే ఇంటికొస్తాడు. ఇక ఇంటికొచ్చాక భార్య ఇంట్లో పనులు చేస్తుండగా.. అతనికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. జరిగిన విషయం వాళ్ళ అమ్మతో అతను చెప్పగానే వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను.. దానిని వదిలేయమని విడాకులు ఇవ్వమని చెప్తుంది.  ఓ ఆరునెలలు చూద్దాం అప్పటికి ప్రెగ్నెన్నీ నిలబడకపోతే అలాగే చేద్దామని అతను అంటాడు. కొన్నిరోజులకి ఆమెకి సవిత అనే ఫ్రెండ్ వాట్సప్ లో మెసెజ్ చేస్తుంది. అది చూసి తనకి ఫోన్ చేస్తుంది. అలా చాలా సేపు మాట్లాడుకున్నాక సవిత వారింటికి వస్తుంది. ఆ తర్వాత ఆమె లైఫ్ లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఎంతోకాలంగా పిల్లలకోసం చూస్తున్న ఆమె పిల్లల్ని కనగలిగిందా? సవిత వచ్చాక ఆమె లైఫ్ ఎలా మారిపోయిందని మిగతా కథ.