English | Telugu

ముంబాయిలో విజయ్‌ దేవరకొండకు ప్రమాదం... ఏం జరిగింది?

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండకు ముంబైలో ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సోషల్‌ మీడియా ఎంతో ఫాస్ట్‌గా ఉందంటే... చీమ చిటుక్కుమన్నా అది కూడా ఒక న్యూసే అన్న రేంజ్‌లో ఎంతో అలర్ట్‌గా ఉంటున్నారు. ఇప్పుడు వైరల్‌ అవుతున్న విజయ్‌ దేవరకొండ వీడియో కూడా అలాంటిదే. వాస్తవానికి అక్కడ జరిగింది ప్రమాదం కానేకాదు. విజయ్‌ దేవరకొండ ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబై వెళ్లారు. ఓ బిల్డింగ్‌ నుంచి కిందకు దిగుతున్నప్పుడు స్లిప్‌ అయి మెట్లపై నుంచి కిందకు జారి పడిపోయారు. అయితే వెంటనే తేరుకొని పైకి లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అతనికి గాయాలేమీ తగల్లేదని తెలుస్తోంది. ముంబైలో మితిబాయి క్షితిజ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో విజయ్‌ చేస్తున్న సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. ఓ ఫైట్‌ సీక్వెన్స్‌లో విజయ్‌ భుజానికి గాయమైంది. ప్రస్తుతం ఫిజియోథెరపీ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా షెడ్యూల్‌ డిస్ట్రబ్‌ అవ్వకుండా ఉండాలని నొప్పి భరిస్తూనే షూటింగ్‌లో పాల్గొంటున్నారు విజయ్‌.