English | Telugu

శ్రీమతి మూవీ రివ్యూ

 

మూవీ : శ్రీమతి
నటీనటులు: జాన్వీ రాయల, రూపా రాయప్ప, వేంక్ష సుబ్రు, ప్రశాంత్ ఆర్,  దర్శన్ వెంకటేశ్, సికిందర్. డాక్టర్ వత్సల, నవీన్ థాటేర్ తదితరులు
ఎడిటింగ్: 
మ్యూజిక్: కెవిన్ ఎమ్
సినిమాటోగ్రఫీ: రవివర్మ కే
రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శకత్వం: శశిదర్ రెడ్డి పార్లపల్లి

కథ:

ఇద్దరు భార్యభార్తలు కలిసి ఓ హాస్పిటల్ లోని డాక్టర్ తో మాట్లాడుతుంటారు. ఆమెకి ప్రెగ్నెన్సీ రావడంతో డాక్టర్ టెస్ట్ చేసి చెప్తుంది. అయితే హర్మోన్స్ లోపం వల్ల వాటర్ బబుల్స్ వచ్చాయని ఓ ఆరు నెలలు కోర్స్ వాడితే పిల్లలు పుడతారని వారితో డాక్టర్ చెప్తుంది. ఇక ఆ భర్త కన్ఫమ్ గా పిల్లలు పుడతారా అని అడుగగా.. ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్తుంది. అసంతృప్తిగానే ఇంటికొస్తాడు. ఇక ఇంటికొచ్చాక భార్య ఇంట్లో పనులు చేస్తుండగా.. అతనికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. జరిగిన విషయం వాళ్ళ అమ్మతో అతను చెప్పగానే వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను.. దానిని వదిలేయమని విడాకులు ఇవ్వమని చెప్తుంది.  ఓ ఆరునెలలు చూద్దాం అప్పటికి ప్రెగ్నెన్నీ నిలబడకపోతే అలాగే చేద్దామని అతను అంటాడు. కొన్నిరోజులకి ఆమెకి సవిత అనే ఫ్రెండ్ వాట్సప్ లో మెసెజ్ చేస్తుంది. అది చూసి తనకి ఫోన్ చేస్తుంది. అలా చాలా సేపు మాట్లాడుకున్నాక సవిత వారింటికి వస్తుంది. ఆ తర్వాత ఆమె లైఫ్ లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఎంతోకాలంగా పిల్లలకోసం చూస్తున్న ఆమె పిల్లల్ని కనగలిగిందా? సవిత వచ్చాక ఆమె లైఫ్ ఎలా మారిపోయిందని మిగతా కథ.

విశ్లేషణ:

ఈ సినిమా సింపుల్ గా సాగుతుంది. భారీ ట్విస్ట్ లు, ఫైట్లు, పాటలు లేకపోయిన ఎంచుకున్న కథా వస్తువు బాగుంది. ప్రతీ ఇంట్లో ఉండే సాధారణంగా జరిగే సమస్యని తీసుకుని దర్శకుడు చాలా చక్కగా ప్రెజెంట్ చేశాడు. కథలో ఎక్కువ పాత్రలు కూడా ఉండవు.. ఎక్కువ నిడివి కూడా ఉండదు. చాలా తక్కువ సమయంలో ల్యాగ్ లేకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు‌ దర్శకుడు. 

సినిమా నిడివి గంట గంటా నలభై రెండు నిమిషాలు.. ఇందులో పాటలు లేవు.. పెద్దగా ఫైట్లు లేవు.. ఫ్యామిలీతో కలిసి చూసేలా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. పెళ్ళి తర్వాత మహిళ ఎదుర్కొనే సమస్యలని కళ్ళకి కట్టినట్టు చూపించాడు. ఎడిటింగ్ నీట్ గా ఉంది‌. ఎక్కడ ల్యాగ్ లేకుండా ఎక్కడ ఏది అవసరమో అదే తీసుకున్నాడు. 

అశ్లీల పదాలు ఎక్కడా వాడలేదు.. రొమాంటిక్ సీన్లు లేవు.. ప్రతీ పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు సరైన ఇంపాక్ట్ చూపిస్తుంది. శ్రీమతి పార్ట్ టూ కూడా ఉండబోతుందని దర్శకుడు చివరగా చెప్పాడు. ఇది చూసిన వారంతా కచ్చితం సెకెంఢ్ పార్ట్ కోసం ఎదురుచూస్తుంటారు. రవివర్మ కే సినిమాటోగ్రఫీ బాగుంది. కెవిన్ ఎమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

జ్యోతిగా జాన్వీ రాయల ఆకట్టుకుంది. సినిమాకి ప్రధాన బలంగా జాన్వీ రాయల నిలిచింది. రూపా రాయప్ప, వేంక్ష సుబ్రు, ప్రశాంత్ ఆర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. మిగతా వారు వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

ఫైనల్ గా : ప్రతీ గృహిణి చూడాల్సిన సినిమా ఇది. మస్ట్ వాచెబుల్.

రేటింగ్ : 2.75 / 5

✍️. దాసరి  మల్లేశ్