English | Telugu

బాడ్మింటన్ లైఫ్ ని, వైఫ్ ని ఇచ్చింది...నాకు లెక్కలంటే చాలా ఇష్టం

ఇప్పటి వరకు సర్కార్ సీజన్ 3 కి ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చి గేమ్స్ ఆడారు. కానీ ఫస్ట్ టైం ఈ సీజన్ కి ఈ వారం షోకి నలుగురు స్పోర్ట్స్ పర్సొనాలిటీస్ వచ్చారు. బాడ్మింటన్ నుంచి సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, ఇండియన్ క్రికెట్ టీమ్ నుంచి స్నేహ దీప్తి, రావి కల్పనా వచ్చారు. "మిమ్మల్ని ఇలా ఒక షోలో చూడడం చాలా హ్యాపీగా ఉంది..మీరు రెగ్యులర్ గా ఏ షోకి కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు అనుకుంటా" అని ప్రదీప్ అనేసరికి " " ఇదే నా ఫస్ట్ షో..నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం..ఈ షోని ఇంతకు ముందే చూసాను" అని చెప్పారు సైనా నెహ్వాల్....  

రిషిని నమ్మించి మోసం చేసారు కదా.. జగతిపై కోప్పడిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-776లో.. మహేంద్ర ఢిల్లీ నుండి ఇంటికి వస్తాడు. అప్పుడు ఫణీంద్ర, దేవయాని, శైలేంద్ర, జగతి అందరూ హాల్లోనే ఉంటారు. ఢిల్లీలో మన కాలేజ్ గురించి చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. రిషి గురించి చెప్తుంటే చాలా ఆసక్తిగా చూసారంటూ మహేంద్ర చాలా హ్యాపీగా చెప్తుంటాడు. కాసేపటికి  ఈ లవ్ బర్డ్స్ రిషి, వసుధారలు ఎక్కడ అని మహేంద్ర అడుగుతాడు. అయినా ఎవరూ మాట్లాడరు.. కాసేపటికి దేవయాని కాలేజీలో రిషిపై మోపిన అభియోగం గురించి, అతడిని కాలేజీ నుండి తీసేసింది, అలాగే రిషి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని చెప్తుంది. దాంతో ఒక్కసారిగా మహేంద్ర కుప్పకూలిపోతాడు. అందరూ దీనంగా చూస్తారు.

మురారి మనసులో తనకి చోటు లేదని ఎమోషనల్ అయి‌న కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -170లో.. మురారి రాసుకున్న డైరీ చూసి చదువుతుంది కృష్ణ. అప్పుడే మురారి రాగా.. కృష్ణ కంగారుగా డైరీని బెడ్ కింద దాచేస్తుంది. ఇక కృష్ణ, మురారి భోజనం చేయడానికి కిందకి వెళ్తారు. కానీ కృష్ణ ఆలోచన మొత్తం ఆ డైరీ మీదే ఉంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారిలు రేవతి దగ్గరికి వస్తారు. న్యాప్కిన్స్ మురారి బట్టలతో పాటు వెళ్లాయేమో.. కృష్ణ నువ్వు వెళ్లి తీసుకురా అని రేవతి అంటుంది. కృష్ణ వెళ్ళి ఆ డైరీ ఎక్కడ చూస్తుందో అని కంగారు పడతాడు మురారి. ఆ తర్వాత కృష్ణ ఎందుకు నేను వెళ్తానని మురారి అంటాడు. మురారి కంగారు పడడం కృష్ణ గమనిస్తుంది. నీ భార్యకి నేను పని చెప్పకుడదా? నువ్వు వెళ్లి తీసుకురా కృష్ణ అని రేవతి అంటుంది.

రాహుల్ నిజస్వరూపాన్ని స్వప్న అందరిముందు బయటపెడుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -109  లో... కనకం ఇంటికి నిశ్చితార్థంకి వచ్చినవారు కావ్యని పిలిచారా వస్తుందా అని అడుగుతారు. రావడం లేదు ఈ రోజు దుగ్గిరాల వారి ఇంట్లోనే ఫంక్షన్ ఉంది. రుద్రాణి కొడుకు రాహుల్ ది ఎంగేజ్ మెంట్ వాళ్లే ఫోన్ చేసి రమ్మన్నారు కానీ మేము రాలేమని చెప్పినట్టుగా కనకం అంటుంది. కనకం మాటలు అన్నీ స్వప్న వింటుంది. విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రాహుల్ ఎంగేజ్ మెంటా? నన్ను మోసం చేసాడా? తల్లి మాట వినాలా? చెల్లి మాట వినాలా? రాహుల్ మాట నమ్మాలా? అని స్వప్న ఆలోచనలోపడుతుంది.

గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఏ సీరియల్ కి లేనంత ఫ్యాన్ బేస్ ఈ 'గుప్పెడంత మనసు' సీరియల్ కి ఉంది. తాజాగా ఒక కొత్త సీరియల్ ప్రారంభం కాగా గుప్పెడంత మనసు సీరియల్ టైం స్లాట్ ని చేంజ్ చేసి ఆ కొత్త సీరియల్ ని ప్రసారం చేయడంతో.. గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలుపుతూ.. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లలో విపరీతంగా పోస్ట్ లు చేసారు. అయితే ఈ సీరియల్ ప్రోమో విడుదలైన గంటలోనే అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సీరియల్ కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో దీన్ని బట్టే తెలుస్తుంది.

విరూపాక్ష  డ్రామా కంపెనీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ..చాలా రోజులకు షోలో రచ్చ రవి

సిల్వర్ స్క్రీన్ మీద ఏది ట్రెండింగ్ లో ఉంటుందో దాన్నే బుల్లితెర కమెడియన్స్ అంత తీసుకుని వాటి మీద స్కిట్స్, స్పూఫ్స్ చేస్తూ వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు దసరా సాంగ్ ప్రతీ షోలో కనిపించింది. ఇక ఆ ఫీవర్ తగ్గి ఆ గాలి కాస్త "విరూపాక్ష" మూవీ మీదకు మళ్లింది. రాబోయే వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో విరూపాక్ష మూవీ స్పూఫ్ చేశారు. "ఆ మిస్టరీ విలేజ్" థీమ్ తో  స్టేజి మొత్తం అష్టదిగ్బంధనం చేసి వాళ్లకు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళను పిలిపించి మంచి ఎంటర్టైన్మెంట్ ఇప్పించారు హైపర్ ఆది.

పొట్ట కోస్తున్నారు...పాట పాడమన్నారు...కట్ చేస్తే చిన్మయి భజన పాడుతోంది

"అలా మొదలయ్యింది" షోలో వచ్చే సెలబ్రిటీస్ చెప్పే విషయాలు ప్రతీ వారం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అలాంటి షోకి ఈ వారం సింగర్ చిన్మయి శ్రీపాద, యాక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇద్దరూ జంటగా వచ్చారు. అందులో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.." డెలివరీ టైంలో  ఏదో విషయం జరిగిందట కదా...చాలా ఎమోషనల్ కూడా అయ్యారట.. అదేంటో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని కిషోర్ అనేసరికి " నా లైఫ్ లో చిన్నూ డెలివరీని అస్సలు మర్చిపోలేను. డెలివరీకి ఇంకా వన్ వీక్ టైం ఉంది...రొటీన్ చెకప్ కి వెళ్ళినప్పుడు టెక్నికల్ గా డాక్టర్ ఏదో విషయం చెప్పారు.

ఆరియానాకి పెళ్లి చూపులు.. ఇద్దరినీ చేసుకుంటాను!

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 ఈవారం ఎపిసోడ్ చాలా కలర్ ఫుల్ గా మంచి కామెడీతో నవ్వించింది. ఈ షోకి అవినాష్- ఆరియానా, ఆర్జే సూర్య - ఫైమా వచ్చారు. ఎగ్ బ్రేక్ చేసే టాస్క్ లో తాను హెల్ప్ చేయాలి అంటే అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పాలి అంటూ ఓంకార్ ఒక  కండిషన్ పెట్టాడు ఆరియానాకి.."ఆరియానా పెళ్ళెప్పుడు..అసలు ఎలాంటి అబ్బాయి కావాలి" అని ఓంకార్ అడిగేసరికి "నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా..అర్ధం చేసుకునే అబ్బాయి వస్తే చాలు" అని చెప్పింది ఆరియానా. "సరే నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి నా టీమ్ లో ముగ్గురు పెళ్లి కానీ వాళ్ళు ఉన్నారు..ఒక్కొక్కరిని స్టేజి మీదకు తీసుకొస్తాను. నీకు నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు" అన్నాడు ఓంకార్. "సిక్స్త్ సెన్స్ లో ఆరియానాకి పెళ్లి చూపులు జరగబోతున్నాయి అది కూడా ఓంకార్ గారి చేతుల మీదుగా" అని కోరస్ ఇచ్చాడు అవినాష్.