English | Telugu

బాలకృష్ణ కి పద్మభూషణ్ వస్తుంది..మెయిన్ రీజన్ ఇదే    

ఐదు దశాబ్దాలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకి మాత్రమే సాధ్యమయ్యే  విభిన్నమైన నటనతో అభిమానులని,ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ(balakrishna) సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక లాంటి చిత్రాలన్నిటిలోను నటించి కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవమయ్యాడు.రాజకీయాల్లోకి కూడా ప్రవేశించి హాట్రిక్ ఎంఎల్ఏ గా రికార్డు సృష్టించి తన వంతు ప్రజాసేవ ని అందిస్తున్నాడు.తన తల్లి బసవతారకం పేరు మీద కాన్సర్ హాస్పిటల్ ని కూడా స్థాపించి,పేదవాళ్ళకి మెరుగైన వైద్య సేవలని కూడా అందిస్తున్నాడు.

ఈ విధంగా కళ, రాజకీయ,సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేసాడు కాబట్టే  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలయ్య కి పద్మభూషణ్(padmabhushan)అవార్డు ఇవ్వాలనే ప్రతిపాదనని కేంద్ర ప్రబుత్వానికి పంపించింది.బాలయ్య తో పాటు పలువురు పేర్లని పంపించినా కూడా బాలయ్య పేరు మాత్రం హైలట్ గా నిలిచింది.2026 జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా  విజేతలని ప్రకటించనున్నారు..

ఇక ఈ వార్తతో నందమూరి అభిమానుల్లో అయితే ఆనందోత్సవాలు వెళ్లి విరుస్తున్నాయి. బాలయ్య కి ఈ అవార్డు రావడం ఇప్పటికే లేట్ అయ్యిందని,కేంద్ర ప్రభుత్వం తప్పని సరిగా బాలయ్య కి పద్మభూషణ్ ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య ప్రస్తుతం రాజకీయ, సేవా రంగాల్లో బిజీగా ఉంటూనే డాకు మహారాజ్ అనే సినిమాలో చేస్తున్నారు.రీసెంట్ గా విడుదలైన టీజర్ మూవీ మీద అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెంచింది.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది.