కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్ వెనుక అసలు సీక్రెట్.. ఎన్టీఆర్ కాస్ట్యూమర్ పనే!
వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ.. టాలీవుడ్ కి ఎన్నో మరపురాని హిట్లు ఇచ్చారు. కోడి రామకృష్ణ పేరు వినగానే 'దేవుళ్ళు', 'దేవి', 'అరుంధతి', 'అంకుశం', 'మంగమ్మ గారి మనవడు' ఇలా ఎన్నో హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే ఆయన పేరు వినగానే ఆయన హిట్ సినిమాలు మాత్రమే కాదు మరొకటి కూడా గుర్తుకొస్తుంది. అదే ఆయన నుదుటిపై ఉండే బ్యాండ్. ఆయన ఎప్పుడూ బ్యాండ్ కట్టుకునే కనిపిస్తారు.