వైసీపీలో జగన్ వర్సెస్ పెద్దిరెడ్డి?
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పార్టీలో అసంతృప్తి పేరుకుపోతున్న పరిస్థితులు ఉన్నాయని పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు జగన్ ఆదేశాలను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో పార్టీ పరిస్థితి బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందనీ, జగన్ పై పార్టీలో తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.