English | Telugu
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు విచారణలో ఈడీ దూకుడు పెంచింది. మద్యం కుంభకోణం సొమ్మును మనీ లాండరింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలలో గురువారం ఉదయం సోదాలు ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం (సెప్టెంబర్ 18) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరౌతారా? లేదా? అని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ రెబల్ మాత్రమే కాదు అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేరుగా సొంత పార్టీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.
సొంత పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు దూకుడుగా సాగుతోంది. ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురికి బెయిలు వచ్చినా.. కీలకమైన వారు ఇప్పటికీ బెయిలు లభించక రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గురువారం (సెప్టెంబర్ 18) నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదని ఇప్పటికే పలు మార్లు వైసీపీ అధినత జగన్ చెప్పారు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు.
తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని బీఆర్ఎస్ ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరారామావు జాతీయ జెండాను ఎగురవేశారు.
ఇటు పాక్ గుండెలో వణుకు, అటు చైనాకు బెరుకు పుట్టించగల ఒన్ అండ్ ఓన్లీ నేమ్. ప్రెజంట్ యూఎస్ సిట్యువేషన్ కూడా సేమ్ టు సేమ్ సీన్. దటీజ్ నరేంద్ర దామోదర దాస్ మోడీ.
అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న ఆరోపణలపై వైసీపీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై మంగళవారం కేసు నమోదైంది.
భారత్ లో స్వాతంత్ర దినం, రిపబ్లిక్ దినోత్సవం.. ఇలాంటి జాతీయ పండగలను భారత జాతి మొత్తం ఒకే దృక్పథంలో, ఒకే కోణంలో జరుపుకుంటూ రావడం ఆనవాయితీ.
రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి మొదలైంది. జూబ్లీ బైపోల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బరిలో దిగనున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం విషయంలో పదే పదే వాయిదాలు కోరుతున్న మండలి చైర్మన్ న్యాయవాదికి హైకోర్టు షాక్ ఇచ్చింది.
కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరు మరింతగా మెరుగు పడాల్సి అవసరం ఉందని చెప్పిన చంద్రబాబు గతంతో పోల్చుకుంటే కొన్ని శాఖల పనితీరు మెరుగు పడినప్పటికీ, రెవెన్యూ లాంటి శాఖల పనితీరు మరింత మెరుగుపడాలన్నారు.