English | Telugu
"ఎప్పుడోచ్చాం అని కాదన్నయ్య.. బుల్లెట్టు దిగిందా లేదా" ఇది పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్. ఇదే డైలాగ్ ను తన స్టైల్ లో చెప్తుంది హాట్ బ్యూటీ సన్నీ లియోన్.
సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. కానీ ఆ అవకాశం అందరికి రాదు. అయితే రజినీతో సినిమా చేసే ఛాన్స్ రావడమే చాలా గొప్ప విషయం. అలాంటి అవకాశాన్ని వదులుకొని ఇపుడు చాలా బాధపడుతుంది అందాల అనుష్క.
తన అనుమతి లేకుండా తన నడుము చూపించేసరని గోల గోల చేసిన నజ్రియా నజిమ్ ఇపుడు అందరికి తెలిసిందే. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం "వాయ్ మూడి పెసువోయ్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. మమ్ముట్టీ తనయుడు దుల్హర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మున్నార్ లో జరుగుతుంది.
నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం "ప్రతినిధి". ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ....
"కితకితలు" చిత్రంలో అల్లరి నరేష్ కు బండ భార్య గా, తన నటనతో మనల్ని కడుపుబ్బ నవ్వించిన నటి గీతాసింగ్ హీరోయిన్ గా మారింది. జి.మధుబాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనుష్క, ఆర్య జంటగా నటించిన తాజా చిత్రం "వర్ణ". సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుండి U సర్టిఫికేట్ ను దక్కించుకుంది.
మంచు కుటుంబం మొత్తం కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి "పాండవులు పాండవులు తుమ్మెదా" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మనోజ్, విష్ణు, వరుణ్ సందేశ్, తనీష్ లు అన్నదమ్ములుగా నటిస్తున్నారు.
సాయిధరంతేజ హీరోగా అప్పట్లో 2010లో ప్రారంభమైన "రేయ్" సినిమా ఎట్టకేలకు 2014 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వై.వి.యస్. చౌదరి దర్శకత్వంలో మూడు సంవత్సరాల పాటు కష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రం సాయిధరంతేజకు మొదటి సినిమా అవుతుందో లేక రెండో సినిమా అవుతుందో చూడాలి.
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ప్రతినిధి". ఈ చిత్ర ఆడియోను ఈనెల 13న విడుదల చేయనున్నారు. సుధా సినిమాస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా
ఇటీవలే మంచు విష్ణు నటించిన "దూసుకెళ్తా" సినిమా సెన్సార్ సమయంలో సెన్సార్ బోర్డ్ రీజినల్ ఆఫీసర్ ధనలక్ష్మి ఆ చిత్రం దర్శక, నిర్మాతలను ముప్పుతిప్పలు పెట్టిందట. ఈ విషయంపై హీరో విష్ణు కూడా తన ఆవేదనని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వర్మ కూడా ఆ బాధితుల్లో ఒకడిగా చేరిపోయాడు. కానీ వర్మ మాత్రం అందరిలా ఊరుకోకుండా ఆమెపై కేసు వేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంతకీ ఆమె ఏం చేసిందని అనుకుంటున్నారా..?
ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, ఏవియస్ అంటే తెలియని వారుండరు. తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ.. కమెడియన్ గా, నటుడిగా, దర్శకుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి ఏవియస్ ఇక మనకు లేరు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "బిజినెస్ మెన్" చిత్రం తెలుగులో మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన పుట్టినరోజు సంధర్భంగా ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. కమల్ కి ధూమపానం అలవాటు ఉంది. అయితే ఇప్పటి నుండి ఆ అలవాటును ఆపెయ్యలని అనుకుంటున్నాడు. ఇంతకీ కమల్ ఇంత మంచి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసా..
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్ర షూటింగ్లో ఆయన గాయపడ్డారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ సింహాచలంలో జరుగుతుంది. ఆ షూటింగ్లో భాగంగా బాలకృష్ణ మోచేతికి స్వల్పంగా గాయమవడంతో, వెంటనే బాలకృష్ణను విశాఖలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో చేర్పించి, చికిత్సను అందించారు.
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాలు "బాహుబలి", "రుద్రమదేవి". అయితే నవంబర్ 7వ తేదీన అనుష్క పుట్టినరోజు సంధర్భంగా "రుద్రమదేవి" చిత్రం యొక్క మొదటి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు దర్శకుడు గుణశేఖర్.