ఏపీలో 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లోని నగరాలకు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అయిదు మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలు ఆ పురస్కారాలు దక్కించుకున్నాయి.